వారికే ysజగన్ ఫస్ట్ ప్రయారిటీ!

వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని 'ఐప్యా'క్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తోంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ దగ్గరుండి స్వయంగా ఇచ్చిన సలహాలు, సూచనలతో ఆ ఎన్నికలను జగన్ గట్టెక్కగలిగారు.

గత ఎన్నికల్లో జగన్ విజయానికి ప్రధాన కారణం 'ఐప్యాక్'

గత ఎన్నికల్లో జగన్ విజయానికి ప్రధాన కారణం 'ఐప్యాక్'


2019 ఎన్నికల్లో జగన్ విజయానికి 'ఐప్యాక్' ఒక ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన టీంలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేపడుతున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ కేసీఆర్ నిరాకరించడంతో కొన్ని టీములు ఏపీకి చేరుకున్నాయి. పీకే సన్నిహితుడు రుషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. ప్రశాంత్ కిషోర్ 'జనసురాజ్' పేరుతో బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు.

పూర్తిగా ఆధారపడుతున్న జగన్

పూర్తిగా ఆధారపడుతున్న జగన్


ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ సంస్థ ఇచ్చే నివేదికలపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. వాటిని దగ్గర పెట్టుకొనే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫుల్లు క్లాసు పీకుతున్నారు. 'ఐప్యాక్' దెబ్బకు మంత్రులు, ఎమ్మెల్యేలే వణికిపోతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ఎటువంటి నివేదికలు అందజేస్తుందో.. ఈసారి సీటు వస్తుందా? రాదా?.. అనే సందిగ్ధంలో పడిపోయారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా కచ్చితంగా పాల్గొంటున్నారు. ఒకవేళ ఎవరైనా పాల్గొనకపోతే ఎవరెవరు పాల్గొనలేదో? ఎందుకు పాల్గొనలేదో? అక్కడి నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి.. తదితర విషయాలపై 'ఐప్యాక్' వెంటనే జగన్ కు నివేదికను అందజేస్తోంది.

ఐప్యాక్ టీంకే ప్రథమ ప్రాధాన్యత

ఐప్యాక్ టీంకే ప్రథమ ప్రాధాన్యత


ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షంగా ఇక్కడ సేవలందించకపోయినప్పటికీ కీలకమైన అంశాల్లో పరోక్షంగా సేవలందిస్తున్నారు. ఆ సంస్థపై జగన్ కూడా పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచారు. మంత్రులు, ఎమ్మెల్యలకన్నా ఐప్యాక్ టీంకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది. టెక్కలిలో గత ఎన్నికల్లో పేరాడ తిలక్ అచ్చెన్నాయుడి చేతిలో ఓటమిపాలయ్యారు.

అయినప్పటికీ ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ ఖరారయ్యారు. ఆయన పేరును జగన్ తాజాగా ప్రకటించారు. అచ్చెన్నాయుడుకు ధీటుగా నిలబడగలిగేది దువ్వాడ ఒక్కరే అని 'ఐప్యాక్' టీం నివేదిక ఇవ్వడంతోనే జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతటి ప్రభావంతమైన స్థితిలో ఉన్న ఐప్యాక్ 2024 ఎన్నికల్లో జగన్ ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదా? అనేది తేలాలంటే ఫలితాలొచ్చేంతవరకు ఎదురు చూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+