ధోనీపై థ్రెడ్ ఆర్ట్- లార్జెస్ట్ ఫొటో ఫ్రేమ్: తెలుగోడి అభిమానం మరి..!!
అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్స్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ గంగపాలయింది. మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీనితో ఇవ్వాళ్టికి మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్.. ఈ సాయంత్రం 7:30కు మొదలవుతుంది.
మ్యాచ్ ఆరంభం కావడానికి అరగంట ముందు నుంచే అహ్మదాబాద్‌లో భారీ వర్షం ఆరంభమైంది. అప్పటి వరకు ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. కొన్ని గంటల పాటు వర్షం తీవ్రత కొనసాగింది. పిచ్‌పై కవర్లు మూసివుంచినప్పటికీ- అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది.

స్టేడియం బయట అడుగు లోతు నీళ్లు పారాయంటే వర్షం ఏ స్థాయిలో పడిందో అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ రీషెడ్యూల్ అవడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. తమ ఆరాధ్య క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ శివతాండవాన్ని చూడటానికి వందలాదిమంది అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివెళ్లారు. నరేంద్ర మోదీ స్టేడియం మొత్తం పసుపుమయమైంది. ఐపీఎల్ 2024లో ధోనీ ఆడతాడా? లేదా? అనేది స్పష్టం కావట్లేదు.
ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే- ధోనీ బ్యాటింగ్ విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూడటానికి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అహ్మదాబాద్‌కు వెళ్లారు. మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో వారంతా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై పడుకున్నారు. ఈ మధ్యాహ్నానికే మొతెరాకు చేరుకుంటోన్నారు. మరి కొందరు స్థానిక ఆలయాలను సందర్శిస్తోన్నారు.

ధోనీపై అభిమానం ఏ స్థాయిలో ఉందంటే- ఓ తెలుగు యువకుడు ఆయనపై ఏకంగా 20 అడుగుల ఎత్తు ఉన్న థ్రెడ్ ఆర్ట్‌ను చిత్రీకరించాడు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఐరన్ ఫ్రేమ్‌ను తయారు చేశాడు. ఆ ఫ్రేమ్‌పై ఫ్లెక్సీలను అతికించి- దానిపై ధోని ముఖాన్ని దారాలతో అల్లాడు. దీనికోసం ఆ యువకుడు 24 కిలోమీటర్ల పొడవు ఉన్న దారాన్ని వినియోగించాడు.
దీన్ని చిత్రీకరించడానికి నాలుగు రోజులు పట్టిందతనికి. ఈ ఐరన్ ఫొటో ఫ్రేమ్‌ను గాల్లోకి ఎత్తడానికి ఏకంగా భారీ క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ధనాధన్ ధోనీపై తన అభిమానాన్ని ఆ తెలుగు యువకుడు ఇలా నిరూపించుకున్నాడు. ఈ ఫ్రేమ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications