సన్‌రైజర్స్ గెలవలేదుగా: టీడీపీ ఓడిపోయినట్టేనా: ఆ ట్వీట్.. వైరల్
KKR vs SRH Qualifier 1: ఐపీఎల్ 2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. క్వాలిఫయర్ 1లో తడబడింది. టేబుల్ టాపర్ కోల్‌కత నైట్‌రైడర్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇదొక్కటీ గెలిస్తే ఫైనల్స్ చేరే దశలో చేతులెత్తేసింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమష్టిగా విఫలం అయ్యారీ మ్యాచ్‌లో.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది సన్‌రైజర్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆరెంజ్ ఆర్మీ 19.3 మూడు ఓవర్లల్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఈ స్కోర్‌ను అలవోకగా కొట్టేసింది కేకేఆర్. ఫైనల్స్‌లో అడుగు పెట్టింది.

ఫైనల్స్ ఎంట్రీ టికెట్ వంటి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విఫలం అయ్యారు. ట్రావిస్ హెడ్ డకౌట్‌తో వికెట్ల పతనం మొదలైంది. అభిషేక్ శర్మ-3, నితీష్ కుమార్ రెడ్డి- 9, షాబాజ్ అహ్మద్- 0, అబ్దుల్ సమద్- 16, సన్వీర్ సింగ్-0, భువనేశ్వర్ కుమార్- 0 అయ్యారు. టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి- 55, మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్- 32, చివర్లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్- 30 పరుగులతో కొంతవరకు పోరాడారు.
ఫైనల్స్‌లో అడుగు పెట్టడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఛాన్స్ ఉంది. నేడు జరిగే ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంది. ఇందులో గెలిచినా చాలు.. సన్‌రైజర్స్ టీమ్ ఫైనల్స్‌లో అడుగుపెట్టగలుగుతుంది. కేకేఆర్‌తో మరోసారి తలపడుతుంది.
మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ- ఈ క్వాలిఫయర్ 1ను ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో ముడిపెడుతూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ వైరల్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే- టీడీపీ గెలిచినట్లు, కోల్‌కత నైట్ రైడర్స్ విజయం సాధించితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచనట్టవుతుంది అంటూ ఓ ట్వీట్ పెట్టారు.
క్వాలిఫయర్ 1 ప్రారంభం కావడానికి ముందు హను అనే ఎక్స్ యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. టీడీపీ అభిమానిగా భావిస్తున్నారాయనను. టీడీపీకి అనుకూలంగా ఆయన పలు పోస్ట్‌లు పెట్టడం దీనికి నిదర్శనం. తీరా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ట్వీట్ ప్రకారం.. ఎస్ఆర్‌హెచ్ ఓడినందున టీడీపీ సైతం ఓటమి పాలవుతుందంటూ వైసీపీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఈరోజు #SRH గెలిస్తే #CBN CM 💥#KKR గెలిస్తే #Jagan CM 💥#SRHVsKKR 🌟
— H A N U (@HanuNews) May 21, 2024












Click it and Unblock the Notifications