IRCTC వేసవిలో అరకు, విశాఖ టూర్ స్పెషల్ ఆఫర్ - 3 రోజులు, ప్యాకేజీ ఇలా..!!
IRCTC వేసవి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. వేసవిలో ప్రకృతి, పర్యాటక ప్రేమికులు ఎంతగానో ఈ రెండు ప్రాంతాలకు టూర్ ఖరారు చేసింది. మూడు రోజుల పాటు ఈ రెండు ప్రాంతాల్లో పర్యటిం చే విధంగా షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ మేరకు ధరలను ప్రకటించారు. విశాఖ సముద్రతీరంతో పాటుగా అరకులో ప్రకృతి సోయగాలను వీక్షించేలా ఈ సరి కొత్త టూర్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఇందు కోసం పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.
IRCTC వరుసగా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. విశాఖలోని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఈ ప్యాకేజీల్లో భాగంగా పికప్ పాయింట్లను ఏర్పాటు చేసారు. పికప్ చేసుకున్నవారిని హోటల్ కు తీసుకెళ్లి.. లంచ్ తరువాత టూర్ ప్రారంభిస్తారు. ముందుగా తోట్ల కొండ, బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాస గిరి, రిషికొండ బీచ్ సందర్శించి.. తిరిగి హెటల్ కు తీసుకెళ్తారు. అక్కడే రాత్రి భోజనం ఉంటుంది. ఇక, రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు టూర్ ప్రారంభం అవుతుంది. పద్మాపురం గార్డెన్స్, ట్రైబర్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలి కొండ వ్యూ పాయింట్, చివరగా బొర్రా గుహలు వీక్షించి విశాఖపట్నం బయల్దేరుతారు. రాత్రి అక్కడే భోజనం, బస ఉంటుంది. కాగా, ఇక.. మూడో రోజు ఉదయం అల్పాహారం తరువాత సబ్ మెరైన్ మ్యూజియం సందర్శనకు వెళ్తారు. రామానాయుడు ఫిల్మ్ స్టూడియో, బీచ్ రోడ్ మీదుగా తిరిగి ఎయిర్ పోర్టు, బస్టాండ్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు
కాగా, ఈ టూర్ నిత్యం అందుబాటులో ఉంటుంది. ఇక.. ఈ ప్యాకేజీ కోసం సింగిల్ ఆక్యుపెన్సీ రూ.20,035, డబల్ ఆక్యుపెన్సీ రూ.10,860, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.8,450, కాగా, చైల్డ్ విత్ బెడ్ రూ.6,220, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.3770 చార్జి ఉంటుంది. నలుగురు నుంచి ఆరుగురు బుక్ చేసుకుంటే కంఫర్ట్ క్లాస్ డబల్ ఆక్యుపెన్సీ రూ.9800, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.9095 కాగా, చైల్డ్ విత్ బెడ్ రూ.6865, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.6290గా అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఏడు నుంచి పది మంది బుక్ చేస్తే కంఫర్ట్ క్లాస్ డబల్ ఆక్యుపెన్సీ రూ.9220, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.8515 కాగా, చైల్డ్ విత్ బెడ్ రూ.6285, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.5710 ఉంటుంది. యాత్ర ప్రారంభానికి 15రోజుల సమయం మాత్రమే ఉంటే ఒక్కొక్కరికి రూ.250 అదనంగా తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం రైల్వే శాఖ ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications