వినియోగదారులకు IRCTC హెచ్చరిక
సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేసేందుకు అనేక దారులు వెతుకుతుంటారు. డబ్బుతోపాటు సమాచారాన్ని కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజమ్ కార్పొరేషన్ (IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. సంస్థకు చెందిన అధికారిక యాప్, వెబ్ సైట్ మాత్రమే ఉపయోగించాలని సూచించింది.
ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్ "irctcconnect.apk" అని ఉంటుందని, ఫేక్ వెబ్‍సైట్ "https://irctc.creditmobile.site" అడ్రస్‍తో ఉంటుందని, ఇవి రెండూ ఫేక్ అని వెల్లడించింది. ఇలాంటి నకిలీవి ఉపయోగించవద్దని, ఐర్‌సీటీసీ అధికారిక యాప్, వెబ్‍సైట్ ద్వారా మాత్రమే రైలు టికెట్లు సహా ఇతర బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది.

ఐఆర్‌సీటీసీ ఫేక్ యాప్ "irctcconnect.apk"ను ఆండ్రాయిడ్ ఫోన్‍లో డౌన్‍లోడ్ చేసుకొని వాడితే యూజర్ల డేటా సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. https://irctc.creditmobile.site ఫిషింగ్ వెబ్‍సైట్‍ను వినియోగదారులు వాడకూడదని హెచ్చరించింది. ఈ వెబ్‍సైట్ ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‍సైట్‍లా ఉంటుందని, అందులో వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేస్తే.. సైబర్ నేరస్థుల చేతికి చిక్కినట్లేనని పేర్కొంది.
నకిలీ వెబ్‍సైట్ అడ్రస్ వాట్సాప్, టెలిగ్రామ్ మెసేజ్‍ల్లో వైరల్ గా మారిందని, జాగ్రత్తగా ఉండాలంటూ పలు సూచనలు జారీచేసింది. నెట్‍బ్యాంకింగ్, యూపీఐ, బ్యాంక్ కార్డుల వివరాలను తెలుసుకునేందుకు సైబర్ నేరస్థులు ఫేక్ యాప్‍లు, వెబ్‍సైట్‍లను తయారు చేస్తున్నారని సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని, ఇతర వెబ్ సైట్ల నుంచి ఇన్ స్టాల్ చేయకూడదని, బ్యాంకు కార్డు వివరాలు, ఓటీపీ, యూపీఐ లాంటి వివరాలను ఫోన్ ద్వారా ఇతరులకు ఎవరికీ చెప్పకూడదని తెలిపింది.












Click it and Unblock the Notifications