PSLV C-52: ఫిబ్రవరి 14న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-52 .. మిషన్ ఫుల్ డిటైల్స్ ఇవిగో..!
భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ పరిశోధన సంస్థ ( ISRO ) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దాదాపు అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈనెల 14న రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 14న ఉదయం 5 గంటల 59 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఈ ఏడాది తొలి ప్రయోగం
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పెస్ సెంటర్ నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగం ఇది. మొదటి ప్రయోగ వేదిక నుంచి పోలార్ శాలిలైట్ లాంచ్ వెహికిల్ సీ-52 ( PSLV C-52 ) వాహక నౌకను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ వాహక నౌకలో 4 దశల అనుసంధానం పూర్తి చేసి.. శిఖర భాగాన ఉష్ణ కవచం చేపట్టనున్నారు శాస్త్రవేత్తలు.

ఫిబ్రవరి 13న ఉ. 4.29 గంటలకు కౌంట్ డౌన్
ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ఫిబ్రవరి 13న వేకువజామున 4.29 గంటలకు ప్రారంభమవుతుంది. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది . అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పోలార్ శాలిలైట్ లాంచ్ వెహికిల్ సీ-52 ( PSLV C-52 ) వాహక నౌక ఐఆర్‌శాట్-1-ఏతో పాటు ఐఎన్‌ఎస్-2-టి.డి, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనుంది.

హై క్వాలిటీ ఇమేజెస్‌ను తీసి పంపనున్న శాటిలైట్
ఈ రాకెట్ ప్రయోగం ద్వారా వ్యవసాయం, అడవులు, ప్లాంటేషన్స్, నేలలో తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌లకు సంబంధించిన వాటిని ఈ శాటిలైట్ హై క్వాలిటీ ఇమేజెస్‌ను తీసి పంపిస్తుంది. పీఎస్ఎల్వీ తనతో పాటు 1,710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్-04 శాటిలైట్ తో పాటు మరో రెండు శాలిలైట్లను నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈఓఎస్-04 శాటిలైట్ ను 529 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు.

ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్
ఇక మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటైన ఇన్స్పైర్ శాట్-1ను యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్ ఐఎన్ఎస్-2టీడీ ని ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అనుమతి లభించిన తర్వాత 25 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications