జబర్దస్త్ వర్ష ఫోటో ఆ గ్రూపుల్లో పెట్టిన హేమ.. రేవ్ పార్టీతో వెలుగులోకి సంచలనాలు
బెంగళూరు రేవ్ పార్టీలో దొరికి అడ్డంగా బుక్కైన నటి హేమ వ్యవహారం ఇప్పుడు సినీవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ, అసలు రేవ్ పార్టీ గురించే తనకు తెలియదన్నట్టుగా వీడియో రిలీజ్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, డ్రగ్స్ టెస్ట్ లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు వెలుగులోకి రావడం వంటి ఘటనలతో నటి హేమ మీద టాలీవుడ్ పరిశ్రమలోని అనేకమంది నటీమణులు సంచలనఆరోపణలు చేస్తున్నారు.
హేమ క్యారెక్టర్ పై తమన్నా సింహాద్రి షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే కరాటే కళ్యాణి నటి హేమ క్యారెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా ఇటువంటి రేవ్ పార్టీలకు నటి హేమ హాజరు కావడంతో పాటు, ఇండస్ట్రీలో ఉండే అనేక మంది అమ్మాయిలకు ఎరవేసి వాళ్ళని కూడా సప్లై చేస్తూ కోట్లు గడిస్తున్నది అంటూ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి వ్యాఖ్యలు చేశారు.

హేమపై మళ్ళీ ఎటాక్ చేసిన కరాటే కళ్యాణి
కరాటే కళ్యాణి కూడా హేమ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. ఇక తాజాగా మరోమారు హేమపైన వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి రేవ్ పార్టీ ఇష్యూలోనే కాదు గతంలో కూడా చాలా విషయాలు జరిగాయని హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారని వాళ్ల ఫోటోలను హేమ గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటుందని, దానికి నేనే సాక్ష్యమని చెప్పారు.
వర్ష ఫోటో వాట్సప్ గ్రూప్ లో షేర్ చేసిన కరాటే కళ్యాణి
గతంలో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించిన కరాటే కళ్యాణి జబర్దస్త్ వర్ష ఫోటోలను ఒకసారి హేమ గ్రూప్ లో పెట్టిందని, ఎందుకు ఈ ఫోటో గ్రూపులో పెట్టింది అని చాలామంది అడుగుతుంటే వెంటనే డిలీట్ చేసిందని, ఎవరో అడిగితే ఎవరికో పంపబోయి గ్రూప్ లో పెట్టాను అని చెప్పిందని కరాటే కళ్యాణి పేర్కొంది.
వర్ష ఫోటో ఎవరికి పంపాలి అనుకుంది.. హేమ తీరుపై ఎప్పుడో డౌట్స్
అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకు ఉంది? వర్ష ఫోటోను ఆమె ఎవరికి పంపాలనుకుంది? ఆ గ్రూప్ లో ఎందుకు పెట్టింది? అని మాకు చాలా అనుమానాలు వచ్చాయని తెలిపింది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తేనే హేమ అంతగా డబ్బు సంపాదించలేదని, హేమ సినిమాలలో నటిస్తున్న పేరుతో చేయకూడనివి అన్ని చేస్తుందని, తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందని కరాటే కళ్యాణి సంచలన ఆరోపణలు చేసింది.












Click it and Unblock the Notifications