ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు
ఏపీలో కోవిడ్ 19 కల్లోలం కొనసాగుతోంది. దీంతో పాటే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు దాదాపు 100 మంది కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో కోవిడ్ 19 మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ కూడా భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఏపీలో కోవిడ్ 19 కారణంగా మృతిచెందిన వారి అంత్యక్రియల కోసం రూ.15 వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో కోవిడ్ 19 మృతులఅంత్యక్రియల కోసం జిల్లా కలెక్టర్లు ఈ మొత్తం కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మృతదేహాలకు అంత్యక్రియల ఆర్ధికసాయంపై కలెక్టర్లకు ఈ మేరకు అధికారాలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తాజాగా ఉత్తర్వులు విడుదల తేశారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.

ఏపీలో ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా చనిపోయిన వారికి అంత్యక్రియలు మధ్యతరగతి కుటుంబాలకు సైతం భారంగా మారిపోయాయి. కోవిడ్ కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులను ఆస్పత్రుల నుంచి స్వాధీనం చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలంటే అంబులెన్స్‌లు వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. ఆ తర్వాత వారి అంత్యక్రియలకు సైతం ఆర్దికంగా చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంత్యక్రియలు పూర్తయితే చాలన్న భావన మృతుల కుటుంబ సభ్యుల్లో పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇలాంటి వారికి రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications