అంతఃపురం టాక్.. భారతి రెడ్డిని సీఎం చేసే ఆలోచనలో జగన్.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కామెంట్స్
గొల్లపూడిలో దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట తడబడటం నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి జగన్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ తన సతీమణి భారతి రెడ్డిని సీఎం చేయాలనే ఆలోచనను ఇలా బయటపెట్టారా అని ఆయన ప్రశ్నించారు.
'ఏంటి సంగతి ముఖ్యమంత్రి జగన్ గారు... భారతి రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన బహిర్గతం చేసారా...? లోపల మాట్లాడుకునే మాటలు మీ వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేసేందుకు ఇలా వదిలి నట్టు ఉన్నారు. జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అని అంతఃపురం టాక్...!' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.

'జగన్ జైలుకు వెళ్లడానికి సిద్దమయ్యారు కాబట్టే కన్ఫ్యూజన్‌లో ఇలాంటి మాటలు నిజాలుగా వచ్చేశాయని అంటున్నారు..' బచ్చయ్య చౌదరి అన్నారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో మంగళవారం(జూన్ 28) నిర్వహించిన 'దిశ' మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 'ఏపీ ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ..' అని వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత ఆయన్ను అలర్ట్ చేయడంతో... 'ఏపీ హోంమంత్రి' అంటూ తన మాటను సరిచేసుకున్నారు.
ఇకపోతే రాష్ట్రంలో ప్రతీ మహిళ దిశ యాప్‌ను ఉపయోగించాలని సీఎం పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి... దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications