Kanna Lakshminarayana : కన్నా లక్ష్మీనారాయణకు జగన్ సర్కార్ షాక్-అంబటి హ్యాండ్ ఉందా ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర స్ధాయిలోనే కాదు నియోజకవర్గాల్లోనూ పరిస్ధితులు ఉప్పునిప్పుగా మారుతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న చోట రిస్క్ తీసుకునేందుకు సిద్ధం కావడం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం వెలువడింది.
పల్నాడులోని సత్తెనపల్లిలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఉన్న గన్ మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజులుగా కన్నా ఇంటికి గన్ మెన్లు రావడం లేదు. ఆరా తీస్తే ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు తాము విధులకు రావడం లేదని చెప్పినట్లు సమాచారం.

వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణకు ఐదేళ్ల క్రితమే గన్ మెన్ల భద్రత కల్పించారు. అప్పట్లో నెలకొన్న పరిస్ధితులతో ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు గన్ మెన్లను ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఈ భద్రత కొనసాగింది. అయితే కన్నాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం, ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా కన్నా భద్రత కొనసాగింది.
అయితే తాజాగా ప్రభుత్వం హోంశాఖ తరఫున నిర్వహించే సమీక్షలో కన్నాకు భద్రత ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ కన్నాకు మాత్రం గన్ మెన్ల ఉపసంహరణపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి కన్నాకు భద్రత లేకుండా చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సత్తెనపల్లిలో కన్నాను టీడీపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత అక్కడ ఆయన కదలికలు పెరిగాయి. దీంతో సహజంగానే ఇది మంత్రి అంబటిపై ఒత్తిడి పెంచుతోంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications