Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబూ.. మీ స్కీం బాగుంది..! జగన్ సంచలన ట్వీట్..!

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ మధ్య దశాబ్దానికి పైగా రాజకీయ శత్రుత్వం ఉంది. ఇద్దరూ నేరుగా కలుసుకుని కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలు కూడా లేవు. అసెంబ్లీలో నేరుగా ఇద్దరూ మాట్లాడుకున్నదీ లేదు. అలాంటిది చంద్రబాబును ఉద్దేశించి మీ స్కీం బాగుంది అంటూ జగన్ అంటే అందులో ఏదో మర్మం ఉన్నట్లే కదా.. ఇవాళ అదే జరిగింది.

రాష్ట్రంలో తాజాగా పేదలకు కట్టించిన 3 లక్షల ఇళ్లను చంద్రబాబు సర్కార్ ప్రారంభించింది. తాము 3 లక్షల ఇళ్లు కట్టించామని, 2029 నాటికి ఇళ్లు లేని పేదలే ఉండరంటూ చంద్రబాబు, మంత్రులు చెప్పుకున్నారు. అయితే తాము నిర్మించిన ఇళ్లు ఇప్పుడు ప్రారంభించి ఆ క్రెడిట్ చోరీ చేయడం ఏంటని జగన్ ఇవాళ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబుగారూ... మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న "క్రెడిట్‌ చోరీ స్కీం'' చాలా బాగుందని జగన్ సెటైర్లు వేశారు.

Jagan s Satire Targets Chandrababu Naidu for Stealing Credit on House Construction

పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.., ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా... దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా... ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా...
గత ప్రభుత్వం అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయస్సార్‌సీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని "ఇళ్లన్నీ మేమే కట్టేశాం" అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ... ఆ క్రెడిట్‌ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉందని జగన్ విమర్శించారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారన్నారు.

మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్‌ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే అని జగన్ ఆరోపించారు. ఇవి కాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా... అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! అన్నారు.

Jagan s Satire Targets Chandrababu Naidu for Stealing Credit on House Construction

మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చేయించామని, 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్‌ చేయించి...కోవిడ్‌లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్‌ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం అన్నారు. తాము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్‌ చేయించి కట్టడం మొదలుపెట్టామని, మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం! అన్నారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి అంటూ ముగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+