Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కు షాక్- బాయ్ కాట్ కాల్..!

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఓ ఆటంకం ఏర్పడింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ఎలాగైనా విడుదల చేయాలని డేట్ కూడా ఇచ్చేసిన టీమ్ ... ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ చిత్రానికి పోటీగా రాకుండా చిరంజీవి తన విశ్వంభర చిత్రం విడుదలను కూడా వాయిదా వేసుకున్నారు. తీరా చివరి నిమిషంలో రామ్ చరణ్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉండి కడప పెద్ద దర్గాను దర్శించుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిరసనగా యావత్ హిందూ సమాజం ఆయన సినిమా గేమ్ చేంజర్ ను బహిష్కరించాలని జన జాగరణ సమితి ఇవాళ పిలుపునిచ్చింది. ముఖ్యంగా అయ్యప్ప మాలలో ఉండి దర్గాను దర్శించుకోకూడదని తెలిసినా కూడా వచ్చానని ముస్లిం మత పెద్దలతో రామ్ చరణ్ గర్వంగా చెప్పుకోవడాన్ని ఖండించింది.

jan jagran Samithi call for ramcharan s game changer movie- here is reason

రామ్ చరణ్ కు కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో అయ్యప్పమాలను అపవిత్రం చేశారని జన జాగరణ సమితి ఓ ప్రకటనలో విమర్శించింది. అయ్యప్ప మాలలో లేనప్పుడు రామ్ చరణ్ ఏఆర్ రెహమాన్ ను సంతృప్తి పరచడానికి సున్తీ చేయించుకున్న కూడా హిందువులకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. అలాగే ఉపాసన కూడా తన భర్త సెలబ్రిటీ కదా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని తెలిపింది. అయ్యప్ప మాల దీక్ష నియమాలను అతిక్రమించినందుకు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని జన జాగరణ సమితి ఏపీ కన్వీనర్ వాసు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+