జనసేన ఎమ్మెల్యే రాసలీలలు లీక్.. ఏడాదిన్నరలో ఐదు సార్లు అబార్షన్.. వీడియో వైరల్

పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో.. నిన్న గాక మొన్ననే అధికారికంగా ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తరహా ప్రకటన ఇచ్చిందో లేదో తెలియదు కానీ.. మొదటిసారి అలా ఇచ్చి చర్చనీయాంశం అయ్యింది జనసేన పార్టీ. కానీ ఇప్పుడు పాములు పట్టే వారు పాముకాటుకే మరణిస్తారు అనే సామెత లాగానే .. సరిగ్గా ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి మూడు రోజులు కూడా కాకముందే మరో ఎమ్మెల్యే కీచక పర్వం బయటపడింది.

ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు మహిళల్ని వేధింపులు గురి చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారికి నేను మాత్రం ఏ తక్కువ కాదంటూ ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా బెదిరిస్తూ.. ఐదు సార్లు గర్భవతిని చేసి అబార్షన్‌ చేయించాడు ఓ ప్రజా ప్రతినిధి. తల్లిదండ్రులు లేని మహిళా ఉద్యోగినిని భయపెట్టి లోబర్చుకున్నఆయనే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌.

jana-sena-mla-arava-sridhar-physical-abuse-and-harassment-on-women-video-goes-viral-on-social-media

ఏం జరిగిందంటే..

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ, అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదిన్నరలో తనను ఐదుసార్లు గర్భవతిని చేశారని.. అబార్షన్‌ కూడా చేయించారని బయటపెట్టింది. ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళా ఉద్యోగికి ఇదివరకే పెళ్లయింది. మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఉద్యోగ రీత్యా భర్త హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అయినా కానీ ఈ ఎమ్మెల్యే రాసలీలలు కొనసాగించడం హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా.. అందుకు ఒప్పుకోకపోవడంతో తన భర్తకు ఫోన్‌ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఐటీ ఉద్యోగం చేస్తున్న తన భర్తకు విడాకులు ఇవ్వాలని హుకుం జారీ చేశారని దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని చెబుతుంది. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని చెప్పింది చేయాల్సిందేనని పట్టుబట్టాడని.. లేదంటే తన మూడేళ్ల బిడ్డ ప్రాణం తీస్తానని హెచ్చరించారని కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలా ఏడాదిన్నర కాలంగా సదరు జనసేన ఎమ్మెల్యే ఆగడాలు బరాయిస్తూ రాగా.. ఇప్పుడు తట్టుకోలేక వీడియోలు, వాట్సాప్‌ చాట్‌లతో సహా బయట పెట్టడం కలకలం రేపుతోంది.

మరోవైపు కొద్దిరోజుల క్రితమే ప్రెస్ నోట్ లో.. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించవలసి ఉంది. రాజ్యాంగబద్ధంగా, ప్రజా సేవే పరమావధిగా జనసేన ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో తోడు నీడగా ఉన్న జనసేన శ్రేణులకు నా కృతజ్ఞతలు అని పవన్ పేర్కొన్నారు. అన్ని వేళలా మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇప్పుడు మూడు రోజలు గడవక ముందే పిడుగులాంటి ఈ వార్త బయటపడడం సర్వత్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ విమర్శలు గుప్పిస్తోంది. ఇదేనా మీరు మహిళలకు కల్పించే రక్షణ? ఈ బాధితురాలికి మీరు ఏం న్యాయం చేస్తారు? అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ లను ట్యాగ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+