అనంతలో పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం: వెంకయ్యకు కౌంటర్, నోట్ల రద్దు పైనా
అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం అనంతపురం సభలో ప్రత్యేక హోదా, రాయలసీమ వెనుకబాటుతనంతో పాటు రూ.500, రూ.1000 నోట్ల రద్దు అంశం పైన కూడా స్పందించనున్నారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ తొలుత తిరుపతి, ఆ తర్వాత కాకినాడ, ఇప్పుడు అనంతపురంలో సభను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మధ్యాహ్నం అనంతపురం చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

వెంకయ్యకు కౌంటర్ ఇస్తారా?
గత కాకినాడ సభలో బీజేపీ, వెంకయ్య నాయుడుల పైన పవన్ విమర్శలు చేశారు. దానికి వెంకయ్య నాయుడు, ఇతర బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ సభలో వెంకయ్య నాయుడు, బీజేపీకి ఎలాంటి కౌంటర్ ఇస్తారనే చర్చ సాగుతోంది.
పవన్‌కు ఘన స్వాగతం
పవన్ కళ్యాణ్ అనంతపురం వచ్చారు. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన త్రీస్టార్ హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి సభ వద్దకు వెళ్తారు. ప్రత్యేక హోదా పైన నిర్వహించనున్న ఈ సభకు పేరు కూడా పెట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రత్యేకంగా వేదికను తీర్చిదిద్దారు.
వేదికకు కల్లూరు సుబ్బారావు, మైదానానికి తరిమెల నాగిరెడ్డి ప్రాంగణంగా పేరు పెట్టారు. మైదానంలో వీఐపీలకు ప్రత్యేక గాలరీ ఏర్పాటు చేశారు. సభా వేదికపై పవన్ ఒకరే ఉంటారు. గంటన్నర పాటు ప్రసంగం ఉంటుంది. మైదానంలో రెండు ఎల్ఈడీ తెరలు, బయట వైపు మూడు ఏర్పాటు చేశారు.
అభిమానులు, కార్యకర్తలు అధికంగా వస్తే గ్రౌండ్ సరిపోదు. కాబట్టి ఆర్ట్స్ కళాశాల మైదానం, ఎన్టీఆర్ కూడలి, ఆర్‌ఎఫ్ కూడలిలో తెరలను ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల ప్రహరీ చుట్టూ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు నెలకొల్పారు. సభకు వెళ్లేందుకు నాలుగు రోడ్లు ఉన్నాయి.
కాలేజీ ప్రధాన గేటును వీఐపీల కోసం కేటాయించారు. ఈ ముఖద్వారం గుండా పవన్ వేదిక వద్దకు చేరుకుంటారు. అలాగే మైదానానికి మూడు గేట్లు అభిమానులు, కార్యకర్తల కోసం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండు నుంచి ఓ గేటు ఉంది.
సభ ముగియగానే కార్యకర్తలు సులువుగా, త్వరగా బయటకు వెళ్లడానికి నాలుగు గేట్లు ఉపయోగపడతాయి. అభిమానులు పవన్‌ను చూడటానికి పెద్దసంఖ్యలో వస్తారు. తోపులాట జరగకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 800 మంది పోలీసులు బందోబస్తు విధులకు కేటాయించారు. మరో 300 మందిని రిజర్వులో ఉంచారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications