సినిమాలకు పవన్ కల్యాణ్ గుడ్ బై ..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత కానీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించిన ఆయన , 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణ ఓటమిని చవి చూశారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో తిరిగి పొత్తు పెట్టుకుని ఘన విజయం సాధించారు.

21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు. పంచాయితీ,రూరల్ డెవలప్మెంట్ ,రూరల్ వాటర్ సప్లై ,అటవీ శాఖ, పర్యావరణ శాఖలను పవన్ కల్యాణ్‌కు అప్పగిస్తూ సీఎం చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కల్యాణ్‌కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయింది. అయితే ఆయన ఇక మీదట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

janasena chief pawan kalyan quit from movies

ఒకవేళ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించిన పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో ఆయన సినిమాల్లో నటిస్తే మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రి అంటే ఆ శాఖలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పైగా పవన్‌కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన సినిమాల్లో నటించరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆయన అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+