రాజమండ్రి జైలుకు పవన్ కల్యాణ్- డిసైడింగ్ టైం..!!
జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును కలవాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను పవన్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన బంద్ కు పవన్ మద్దతు ఇచ్చారు. ఇప్పటికే లోకేశ్ తోనూ పవన్ మట్లాడి మద్దతు ప్రకటించారు. తన మద్దతు చంద్రబాబుకు ఉంటుందని స్పష్టం చేసిన పవన్..ఇప్పడు నేరుగా జైలుకు వెళ్లటం ఆసక్తి కరంగా మారుతోంది.
చంద్రబాబు వద్దకు పవన్ : చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో భాగంగా రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును జనసేనాని కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఆయన ములాఖత్ కు అప్పాయింట్ మెంట్ తీసుకున్నారు. రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు పవన్ రాజమండ్రి జైలులో చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

ఇందు కోసం జైలు అధికారులు 40 నిమిషాలు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఖండించిన పవన్..నేరుగా విజయవాడకు వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకోవటం..రోడ్డుపైనే పడుకొని నిరసన వ్యక్తం చేసారు. ఆ తరువాత చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.
జైలులో ములాఖత్ : టీడీపీ నిర్వహించిన బంద్ లోనూ జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. చంద్రబాబును రాజమండ్రికి తరలించే సమయంలోనే లోకేశ్ కు పవన్ ఫోన్ చేసి మాట్లాడారు. కలిసి పోరాటం చేద్దామని..ధైర్యంగా ఉండాలని సూచించారు. తరువాత జరిగిన మీడియా సమావేశంలోనూ పవన్ ను తన సోదరుడిగా లోకేశ్ పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు లోకేశ్ రాజమండ్రిలోనే మకాం వేసి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జైలు లో చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసారు.
ఇక, చంద్రబాబు న్యాయవాది సిద్దార్ధ లూద్రా రాజమండ్రికి చేరుకున్నారు. అటు చంద్రబాబు పై స్కిల్ కేసులో వేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని హై కోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 19న ఆ పిటీషన్ విచారణకు రానుంది. ఆ తరువాతనే చంద్రబాబు బెయిల్ పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

బీజేపీ తీరుపై సందేహాలు : ఇక, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న పవన్ తమతో టీడీపీని కలుపుకొని వెళ్లే విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నుంచి స్పందన లేదు. ఇదే సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ నేతలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ సమయంలో పవన్ నేరుగా చంద్రబాబును జైలు లో కలవాలని నిర్ణయించటం ద్వారా..ఇక బీజేపీ నుంచి భవిష్యత్ లో అభ్యంతరాలు వచ్చినా...రాకున్నా తాను చంద్రబాబుతోనే ఉంటాననే సంకేతాలు క్లియర్ చేస్తున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, చంద్రబాబు..టీడీపీతో పొత్తు వ్యవహారంలో బీజేపీ నిర్ణయం ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications