ద్వారంపూడి ఉప్మా రుణం తీర్చుకుంటున్న జనసేన! ముద్రగడకు మనీఆర్డర్ల వెల్లువ..!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని పవన్ టార్గెట్ చేయడంతో వీరిద్దరూ తిరిగి ఆయన్ను కౌంటర్ చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో పవన్ కు ముద్రగడ రాస్తున్న లేఖలు కాపు సామాజిక వర్గంతో పాటు జనసేన నేతల్లో ఆగ్రహం పెంచుతున్నాయి.

ఓవైపు పవన్ తీరును నిరసిస్తూ ముద్రగడ పద్మనాభం రోజురోజుకీ డోస్ పెంచుతూ లేఖలు రాస్తున్నారు. మరోవైపు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శల దాడి పెంచుతున్నారు. దీంతో జనసేన నేతలు కూడా కౌంటర్లు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో గతంలో కాపు ఉద్యమం సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన సాయానికి రుణం తీర్చేసుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది.

dwarampudipawankalyanmudhragana

గతంలో కాపు ఉద్యమం సందర్భంగా కాపులతో కలిసి ముద్రగడ నిరసనలు చేస్తున్నప్పుడు వారికి అవసరమైన ఉప్మాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తయారు చేసి పంపించారు. అప్పట్లో ముద్రగడతో పాటు కాపు నేతలు కూడా దీన్ని స్వీకరించారు. కానీ ఇప్పుడు ద్వారంపూడి, ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా పరిస్దితులు మారిపోవడంతో పాటు తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఉప్మ స్టోరీ కూడా చెప్పారు. వైసీపీని ఉప్మా పార్టీగా అభివర్ణించారు. దీంతో ఆగ్రహంగా ఉన్న జనసేన నేతలు ఉప్మా రుణం తీర్చేసుకుంటున్నారు.

గతంలో ద్వారంపూడి పంపిన ఉప్మా డబ్బులు ఆయనకు తిరిగి ఇచ్చేయాలని కోరుతూ జనసేన నేతలు, కార్యకర్తలు నిన్నటి నుంచి ముద్రగడ పద్మనాభానికి మనీ ఆర్డర్లు చేస్తున్నారు. ద్వారంపూడి కోసం పవన్ ను వదులుకోలేనంటూ ఓవైపు ముద్రగడ బహిరంగంగానే చెబుతున్న నేపథ్యంలో మీ మిత్రుడికి ఉప్మా డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ జనసేన నేతలు చేస్తున్న మనీ ఆర్డర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పుడు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పోస్టాఫీసుల వద్ద జనసేన నేతలు మనీ ఆర్డర్ల కోసం బారులు తీరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+