Arava Sridhar: అరవ శ్రీధర్ పై తేల్చేసిన జనసేన-కీలక ఆదేశం-వీణ స్కిప్?
జనసేనకు చెందిన కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న పార్టీ త్రిసభ్య కమిటీ త్వరలోనే దీన్ని ముగించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రైల్వే కోడూరుతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వాంగ్మూలాల్ని నమోదు చేసిన పార్టీ కమిటీ సభ్యులు.. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే శ్రీధర్ తో పాటు ఆయన బాధితురాలిగా చెప్తున్న వీణకూ కాల్ చేశారు.
జనసేన త్రిసభ్య కమిటీ విచారణ (Arava Sridhar)
అరవ శ్రీధర్ తనను లైంగికంగా వాడుకుని వదిలేశాడని, ఇద్దరూ వీడియోలు కూడా తీసుకున్నామని, ఏకంగా అసెంబ్లీ నుంచే వీడియో కాల్స్ మాట్లాడేవాడని, ఇలా పలు ఆరోపణలు చేసిన రైల్వేకోడూరు పంచాయతీ ఉద్యోగిని హర్ష వీణను జనసేన కమిటీ పిలిపించింది. విచారణకు వచ్చి వాస్తవాలు వెల్లడించాలని కోరింది. ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని, నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం విచారణకు రాలేదు.

అరవ శ్రీధర్ కు కమిటీ పిలుపు
ఈ నేపథ్యంలో తాజాగా అరవ శ్రీధర్ ను కమిటీ ముందు హాజరై వీణ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని త్రిసభ్యు కమిటీ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా త్రిసభ్య కమిటీ సభ్యుడు శివశంకర్ దీనిపై స్పందించారు. శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని, త్వరలోనే పూర్తిస్థాయి నివేదికను పవన్‌కు సమర్పిస్తామని తెలిపారు. శ్రీధర్‌తో పాటు రైల్వేకోడూరులో 50 మందిని విచారించామన్నారు. వారంలోగా కమిటీ ముందు వివరణ ఇవ్వాలని శ్రీధర్‌కి పార్టీ సూచించిందన్నారు.

అరవ శ్రీధర్ ఎపిసోడ్ పై జనసేన క్లారిటీ
కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా, బాధితురాలు వీణ రాలేదని, సీల్డ్ కవర్‌లో వీణ పంపిన వివరాలను పరిశీలిస్తామని శివశంకర్ వెల్లడించారు. ఇది జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాదని, అరవ శ్రీధర్, బాధితురాలు వీణ మధ్య వ్యక్తిగత వ్యవహారమని, ఈ అంశాన్ని పార్టీపై రుద్దే ప్రయత్నాలు చేయవద్దని విచారణ కమిటీ సభ్యుడు శివశంకర్ కోరారు. ఇప్పటికే అరవ శ్రీధర్ కూడా ఈ వ్యవహారానికీ, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో జనసేన అధికారికంగానే అరవ శ్రీధర్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసినట్లయింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications