పవన్ భార్యపై అసభ్య పోస్టులు ? లీగల్ చర్యలకు జనసేన హెచ్చరిక..

ఏపీలో మహిళలపై సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం పతాకస్ధాయికి చేరుకుంటోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తీవ్ర స్ధాయిలో అసభ్య పోస్టులు పెడుతున్న వ్యవహారం చూస్తుండగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైనా ఈ పోస్టుల రచ్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇందులో హెచ్చరించింది.

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రత్యర్ధులు ముందుగా ఆయన మూడు పెళ్లిళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో అధికార వైసీపీ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే వైసీపీకి సన్నిహితంగా ఉండే వారు, అనుకూలంగా ఉండే మీడియా, యూట్యూబ్ ఛానళ్లు ఇలా వీరంతా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అంటే మూడో భార్య అన్నా లెజ్ నోవాను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనేది జనసేన ఆరోపణ.

pawankalyan1

దీంతో వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు జనసేన ఇవాళ ఓ ట్విట్టర్ ప్రకటనలో తెలిపింది. ఇందులో వైసీపీకి సంబంధించిన పలు ట్విట్టర్ హ్యాండిల్స్ వివరాలను కూడా పోస్ట్ చేసింది. వాస్తవానికి ఇవన్నీ నిత్యం వైసీపీ వర్సెస్ జనసేనగా ట్విట్టర్ లో సాగే వార్ లో కనిపించే హ్యాండిల్సే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ కు భారీ సంఖ్యలో ఉన్న మద్దతు దారుల మెదళ్లను గందరగోళపరిచే విధంగా ఈ పోస్టులు ఉన్నాయని జనసేన ఆరోపిస్తోంది.

రాష్ట్రంలోని ప్రజల్లో అశాంతిని నెలకొల్పేలా, జనసేన క్యాడర్ ను, నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఈ పోస్టులు పెడుతున్నట్లు జనసేన ప్రకటనలో తెలిపింది. వీటిపై ఇప్పటికైనా అదే సోషల్ మీడియాలో పవన్ కు క్షమాపణలు చెప్పాలని పార్టీ కోరింది. ఇందులో ఆలస్యమైతే చట్టపరంగా రెచ్చగొట్టడం, పరువునష్టం కలిగించడం, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేయించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+