గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో రాజ్యాంగం అమలౌతోందా: రోజా ఇష్యూపై చంద్రబాబు మీద జేపీ గరం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలౌతోందా అని లోక్ సత్తా వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అనుమానాన్ని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అమలౌతోందా అని లోక్ సత్తా వ్యవస్థాప అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అనుమానాన్ని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు.

ప్రత్యేక హోదా డిమాండ్ తో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ విశాఖలో జరిగే క్యాండిల్ ర్యాలీ లో పాల్గొనేందుకు వెళ్తే ఎయిర్ పోర్ట్ లోనే ఆయనను అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్ఆర్ సిపి ఎంఏల్ఏ రోజాను గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే ప్రభుత్వం అడ్డుకోవడం సరైంది కాదన్నారు జయప్రకాష్ నారాయణ.

jayaprakash narayana comments on mla roja incident

జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో మహిళ ఎంఏల్ఏ రోజాను పాల్గొనకుండా అడ్డుకోవడం సరైందికాదని ఆయన ఓ మీడియా చానల్ కు చెప్పారు. ప్రజా ప్రతినిధిని ఈ సమావేశంలో పాల్గొనకుండా అడ్డుకోవడం సరికాదన్నారాయన.

ఈ రకమైన ఘటనలు ముఖ్యమంతరికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరును తెస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరులను కించపర్చేలా ప్రవర్తించారని భావిస్తే పరువు నష్టం దావా వేసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు.రాష్ట్రంలో పోలీసులు రాజభక్తిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Jayaprakash narayana comments on mla roja incident.these incidents wrong indications on chief minister chandrababu naidu government he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X