జగన్ పాలనలో కొన్ని విషయాలు అద్భుతంగా ఉన్నాయి :జయప్రకాష్ నారాయణ
ఏపీలో టీడీపీ, జనసేన , బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది లోక్ సత్తా పార్టీ. వెనకపడిన రాష్ట్రం అభివృద్ధిపథంలో నడవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు ఉంటే మేలని.. దీనిలో భాగంగానే కూటమికి లోక్ సత్తా సపోర్టు చేస్తుందని ఆ పార్టీ ప్రకటించింది. తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం , జగన్ పాలన గురించి తనదైనశైలిలో స్పందించారు. జగన్ పాలన ఎలా ఉందో అనే దానిపై జయప్రకాష్ మార్కుల రూపంలో తన స్పందనను తెలియజేశారు. మొత్తం 5 మార్కులకు గాను తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
జగన్ పాలనలో కొన్ని విషయాలు అద్భుతంగా ఉన్నాయని జయప్రకాష్ నారాయణ కొనియాడారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ చాలా నిబద్దతతో పని చేస్తోందని కితాబిచ్చారు. ఈ విషయంలో 4 మార్కులు వేయవచ్చని అన్నారు. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తోందంటూ 3 మార్కులు ఇచ్చారు. హెల్త్ కేర్ అంత గొప్పగా లేదంటూనే ఇటీవల తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానానికి 2 లేదా 3 మార్కులు వేయవచ్చని జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు.

ఏపీలో విద్యా వ్యవస్థకు కేవలం 2 మార్కులే ఇచ్చారాయన. అలాగే వైద్య వ్యవస్థకు 2 మార్కులు, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు. 2019 నుండి 2024 వరకు అంటే గత ఐదేళ్లలో ఏపీలో జగన్ సర్కార్ పాలనకు కేవలం 1 నుండి 2 మార్కులు ఇచ్చారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ది అధ్వాన్నంగా ఉందంటూ కేవలం 1 మార్కు ఇచ్చారు. మహిళా సాధికారతకు 2,హెల్త్ కేర్ కు 2, పెట్టుబడుల ఆకర్షణకు 1 మార్కు ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని కామెంట్ చేశారు. ఈ విషయంలో కేవలం ఒకే ఒక మార్కు ఇచ్చారు. మొత్తానికి జగన్ పాలన ఫెయిల్యూర్‌గా జేపి పేర్కొన్నారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications