చీర కడితేనే..: జయసుధ, గోవిందుడి పైనా (పిక్చర్స్)
హైదరాబాద్: మహిళలకు చీరకట్టు అసలైన ఆనందాన్ని ఇస్తుందని సినీ నటి, సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు జయసుధ శనివారం అన్నారు. శ్రీనగర్లోని సత్యసాయి నిగమాగంలో వస్త్రవిభ పేరిట శనివారం ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

సోమవారం వరకు ఈ ఎక్స్‌పో సాగుతుంది. దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 80 మంది మాస్టర్ వీవర్స్ ఉత్పత్తులు కొలువుదీరాయి. పట్టు, కాటన్, సిల్క్ డిజైనరీ డ్రెస్ మెటీరియల్స్, యాక్ససరీస్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను బతుకమ్మ ఆడానని చెప్పారు.

తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటపాటల్లో ప్రతిబింబిస్తుందన్నారు. తాను అన్నిరకాల చీరలను ఇష్టపడతానని చెప్పారు. తన మనసుకు నచ్చిన చీర దొరికితే వెంటనే కొనేస్తానని చెప్పారు. త్వరలో నగరంలో ఓ బోటిక్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. దసరా కానుకగా రానున్న గోవిందుడు అందరివాడేలే చిత్రంలో మంచి పాత్ర పోషించానని చెప్పారు. తాను నటిస్తున్న మరికొన్ని సినిమాలు సెట్స్ పైన ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications