సినీ నటికి జేసీ క్షమాపణలు..!!
జేసీ ప్రభాకర్ రెడ్డి సినీ నటికి క్షమాపణలు చెప్పారు. తాడిపత్రిలో కొత్త సంవత్సర వేడుకల నెర్వ హణ వివాదాస్పదంగా మారింది. జేసీ నిర్ణయం పైన బీజేపీ మహిళా నేతలు స్పందించారు. జేసీ నిర్ణయాన్ని తప్పు బట్టారు. వారి వ్యాఖ్యల పైన జేసీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ సమయంలో బీజేపీ మహిళా నేత..నటి మాధవీ లత పైన అనుచిత వ్యాఖ్యలు చేసారు. కాగా, ఇప్పుడు తాను చేసిన వ్యాఖ్యలకు జేసీ ఆ నటికి క్షమాపణలు చెప్పారు.
జేసీ నిర్ణయం పై
సినీ నటి.. బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తాను మాధవి లత గురించి ఆవేశంలో మాట్లాడానని విరవణ ఇచ్చారు. లా మాట్లాడటం తప్పేనని అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రక టించారు. తన వయసు 72 సంవత్సరాలు అని.. ఆవేశంలో మాట్లాడానే తప్ప ఎవరికీ కించ పరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఎవరి బ్రతుకు తెరువు వారిదేనని జేసీ వ్యాఖ్యానించారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ పేర్కొన్నారు.

మాధవీ లత పై కామెంట్స్
ఇదే వివాదంలో తన పైన విమర్శలు చేసిన వారి పైనా జేసీ గట్టిగా స్పందించారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులందరూ ఫ్లెక్సీ గాళ్లేనంటూ విమర్శించారు. తాడిపత్రి కోసం ఎంత వరకైనా వెళ్తానని జేసీ మరోసారి తేల్చి చెప్పారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో జేసీ తాడిపత్రి మహిళల కోసం జేసీ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వివాదాస్పదంగా మారింది. ఈ వేడుకలకు హాజరు కావద్దంటూ మాధవీ లత సూచించారు. అదే విధంగా అక్కడ గంజాయి బ్యాచులు ఉంటాయని వ్యాఖ్యానించటం పైన జేసీ సీరియస్ అయ్యారు.
జేసీ క్షమాపణలతో
ఆ సమయంలోనే మాధవీ లత పైన అనుచిత వ్యాఖ్యలు చేసారు. బీజేపీ నేతల పైన మండి పడ్డారు. దీంతో, కూటమిలో భాగ స్వామిగా ఉన్న బీజేపీ నేతల పైన జేసీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. జేసీ తీరు పైన సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. జేసీ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. కాగా, ఇప్పుడు జేసీ క్షమాపణలు చెప్పటం తో ఈ వివాదం ముగిసినట్లేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జేసీ క్షమాపణల పైన మాధవీ లత స్పందన ఏంటనేది వేచి చూడాలి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications