పరిటాల రవిని మాపైకి ఉసిగొల్పారు: జగన్ తాతపై జేసీ, తెలంగాణలోనే

అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత పరిటాల రవీంద్రను ఆనాడు వైయస్ రాజారెడ్డి తమ పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, నాటి టిడిపి నేత పరిటాల రవికి కూడా భయపడలేదన్నారు.

పరిటాల ఇంటికి రాజారెడ్డి వెళ్తుండేవారని, తమ పతనాన్ని రాజారెడ్డి చూడాలనుకున్నారని, అందుకే తమ పైకి ఆయనను ఉసిగొల్పారన్నారు. పరిటాల రవి హత్యతో తమ అన్నకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వైయస్ రాజా రెడ్డి వల్లే ఫ్యాక్షన్ అన్నారు. దానిని తాము ప్రతిఘటించేవాళ్లమన్నారు. తాము ఎలాంటి హత్యలు చేయలేదన్నారు.

ఆయన కారణంగానే తాము గన్ లైసెన్స్ తీసుకున్నామని చెప్పారు. అభివృద్ధే లక్ష్యంగా తాము మొదటి నుంచి పని చేసేవాళ్లమన్నారు. తమ మూలాలు తెలంగాణ లో ఉన్నాయని, గద్వాల్ తమ స్వస్థలమని, గతంలో తమ తాతల కాలంలో తాడిపత్రికి వచ్చేశామన్నారు.

JC Prabhakar Reddy

తాడిపత్రిలో ఒకప్పుడు తానంటే భయపడేవారని, అయితే, అభివృద్ధి కోసం ప్రజలందరూ తనతో సహకరిస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి జేసీ సోదరులు టిడిపిలో చేరారు. దీనిపై ప్రశ్నించారు.

టీడీపీలోకి రమ్మని చంద్రబాబు పిలిస్తేనే వచ్చామని, పరిటాల సునీత మేం టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకించారని చెప్పారు. ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఇగోయిస్టు అని, ఆయన చెప్పిందే జరగాలంటారన్నారు.

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత పరిటాల రవీంద్రను ఆనాడు వైయస్ రాజారెడ్డి తమ పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, నాటి టిడిపి నేత పరిటాల రవికి కూడా భయపడలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+