Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవమానిస్తున్నావ్.. హోంమంత్రి అనితను టార్గెట్ చేసిన టీడీపీ సీనియర్ నేత!

టిడిపి ఫైర్ బ్రాండ్, తాడిపర్తి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తాజాగా ఏపీ మంత్రి వంగలపూడి అనిత పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి వార్ కొనసాగుతున్న వేళ, ఆయన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ను టార్గెట్ చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అనితను టార్గెట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

వంగలపూడి అనితను టార్గెట్ చేసిన చేసి ఆమెకు వరుసగా తమ ప్రశ్నలను సంధించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డామని, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తర్వాత కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. తనకు తన కుమారుడికి గన్ లైసెన్సులు రెన్యువల్ చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తమ గన్ లైసెన్సులు రెన్యువల్ చేయమని ఎన్నో లేఖలు రాసినప్పటికీ హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.

JC Prabhakar Reddy shocking comments on Home Minister Anitha over gun licenses TDP Internal war

అనితమ్మా.. మాకీ అవమానం ఎందుకు

హోం మంత్రి అనిత తనను, తాడిపత్రి ఎమ్మెల్యేను అవమానిస్తున్నారంటూ జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పరిస్థితి ఈ విధంగా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు. తనకు ఈరోజు గన్మెన్లు లేరని, నేను హోం మంత్రికి చెబుతున్న, ఎన్నిసార్లు లెటర్లు రాసిన పట్టించుకోవడంలేదని అన్నారు. నా మాటలతో ఎవరైనా బాధపడకు కానీ మాకు కూడా బాధలు ఉంటాయి అంటూ ఆయన పేర్కొన్నారు.

గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి

అనితమ్మ తప్పు నాదో, నీదో, పోలీసులదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇది ఎమ్మెల్యేకు జరుగుతున్న అవమానమని, గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితిలో తాము ఉన్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక నేడు తాడిపత్రిలో రాయలసీమ పౌరుషం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు పర్వం కొనసాగగా, ఉద్రిక్తపరిస్థితులు చోటు చేసుకుంటున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమై అదనపు బలగాలను మోహరించారు.

జేసీ వంగలపూడి అనితను టార్గెట్

కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ ను స్వీకరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాను చర్చకు సిద్ధమని, నేరుగా పెద్దారెడ్డి ఇంటికే వెళతానని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. ఈ ఉద్రిక్తతల వేళ జేసీ వంగలపూడి అనితను టార్గెట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+