తాడిపత్రి పొలిటికల్ వార్ తీవ్రం-దాడులు కామన్ అన్న జేసీ-వెంట్రుల పీకలేరన్న కేతిరెడ్డి..

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే కొంతకాలంగా తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న జేసీ, కేతిరెడ్డి ఇవాళ మరింత రెచ్చిపోయారు. పరస్పరం ప్రెస్ మీట్లు పెట్టి దూషణల పర్వం కొనసాగించారు. దాడులు, ప్రతిదాడులపై సవాళ్లు ప్రతిసవాళ్లు కూడా విసురుకున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్దితులు కొనసాగుతున్నాయిు.

వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరగబడితే మా తాడిపత్రి గబ్బు పడుతుందని హెచ్చరించారు. దాడులు తమకు కామన్ అని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బ్రతకలేరని జేసీ వ్యాఖ్యానించారు. కానీ తమ ఊరిని భయభ్రాంతులకు గురి చేయదలుచుకోలేదన్నారు. వాళ్లు దాడులు చేస్తే చెయ్యని అని తాము పట్టించుకోమన్నారు. ప్రజల కోసం తాము పాటు పడుతున్నామన్నారు. ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాంమమని, ఘర్షణలకు దిగాల్సిన అవసరం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

kethireddypeddareddyjcprabhakarreddy1

జేసీ విమర్శలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. జేసీ సోదరులు కాంగ్రెస్ పార్టీ లో ఉన్నప్పుడు టీడీపీ వారిపై దాడి జరిగినప్పుడు ఆ పార్టీ నేత కాలువ శ్రీనివాసులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. త్రిశూల్ మైనింగ్ పరిశీలనకు వచ్చిన టీడీపీ నాయకులు జేసీ నివాసంలోనే భోజనం చేసిన మాట వాస్తవం కాదా అన్నారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడే టప్పుడు ఆవ్యక్తి ఎలాంటి వారని తెలుసుకొని మాట్లాడాలన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని చెప్పాల్సిందిపోయి నాపై వాఖ్యలు చేస్తారా అని పెద్దారెడ్డి ప్రశ్నించారు.

కాల్వ శ్రీనివాసులు ఎలాంటివారో తాడిపత్రి రాయదుర్గం ప్రజలందరికీ తెలుసని పెద్దారెడ్డి తెలిపారు. తాడిపత్రిలో జేసి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా కాల్వ శ్రీనివాసులు ఎందుకు ప్రశ్నించరన్నారు. కాలవ శ్రీనివాసులు అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెబితేనే తనపై కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతారన్నారు. తన గురించి మాట్లాడితే మీ రాజకీయ జీవితం బినామీల గురించి చిట్టా విపాల్సి ఉంటుందని పెద్దారెడ్డి హెచ్చరించారు. గతంలో తాడిపత్రి టిడిపి నాయకులపై దాడులు జరిగిన కాపాడిన చరిత్ర మీకు లేదన్నారు.

మీరందరూ కలిసినా నన్ను కట్టడిచేయలేరని, మీరందరిని, మీ పార్టీ వారిని కట్టడి చేసే శక్తి భగవంతుడు తనకు ఇచ్చారని కేతిరెడ్డి తెలిపారు. కాల్వ శ్రీనివాసులు ఇలాగే మాట్లాడితే మీ అవినీతిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చిన అధికారులు లాగానే మీ ఇంటికి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. మీరందరూ కలిసినా నా వెంట్రుక కూడా పీకలేరని పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+