దారుణం:బాలిక, ఆమె తల్లిపై ప్రేమోన్మాది, ఆత్మహత్య
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి తాను పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, యువతి పరిస్థితి విషమంగా ఉంది.
పాతపట్నంకు చెందిన కృష్ణారావు అనే యువకుడు శ్రీకాకుళం తిలక్‌నగర్‌లో నివాసం ఉంటున్న భ్రమరాంబిక ఇంటికి వచ్చాడు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ కత్తితో కృష్ణరావు భ్రమరాంబికపై దాడి చేశాడని బాధితురాలి తల్లి కామేశ్వరి చెప్పారు.

భ్రమరాంబికపై దాడి చేసిన అనంతరం కృష్ణారావు బెడ్ రూంలోకివెళ్లి తలుపులు వేసుకుని, కత్తితో పొడుచుకుని అక్కడికక్కడే కుప్పకూలాడు. వారి మధ్య చాలా కాలంగా ప్రేమవ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఆ విషయాన్ని భ్రమరాంబిక కుటుంబ సభ్యులకు చెప్పేందుకు కృష్ణారావు వచ్చినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన భ్రమరాంబికను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications