పొలిటికల్ ఎంట్రీ పై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు .. మరోమారు రాజకీయవర్గాల్లో చర్చ
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి అనేది చాలా మంది అభిమానులు అభిలాష. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో అదరగొట్టారు. తాత వారసత్వం పుణికి పుచ్చుకున్న నాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్ గుర్తింపు పొందారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మార్మోగుతోంది. అభిమానులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయనను పదేపదే కోరుతున్నారు.

విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చిన ఎన్టీఆర్
ఇక తాజాగా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కు సంబంధించిన ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు మీరే జవాబు చెప్పాలి, మీకే తెలుసు అంటూ సమాధానం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రావాలి, ఎన్టీఆర్ కావాలి అని ప్రజలు పదే పదే కోరుకుంటున్నారని ప్రశ్నించిన క్రమంలో దానిపై మాట్లాడడానికి సమయం , సందర్భం ఇది కాదంటూ ఆయన తోసిపుచ్చారు.

రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై ఎప్పుడూ ఆసక్తికర చర్చే
ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు అని ఎన్టీఆర్ కామెంట్ చేశారు. దీనిపై వేడివేడి కాఫీ తాగుతూ మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ ఎన్టీఆర్ చలోక్తులు విసిరారు.
ఇప్పటికే పలుమార్లు అనేక సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, లేక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సంక్షోభంలో ఉన్న ప్రధానంగా వినిపిస్తున్న పేరు జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది.

ఇటీవల చంద్రబాబు పర్యటనలోనూ జూనియర్ ఎన్టీఆర్ కోసం నినాదాలు
ఇటీవల చంద్రబాబు పర్యటన లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించాలి అంటూ చంద్రబాబు ముందే నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే పార్టీలో జోష్ పెరుగుతుందని, పునర్వైభవం వస్తుందని స్పష్టం చేశారు. ఇక తాజాగా మరోమారు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యాఖ్యలతో రాజకీయ ఆరంగేట్రం పై ఎటువంటి ఆసక్తి కనబర్చలేదు. రాజకీయాలపై మాట్లాడడానికి ఇది సమయం , సందర్భం కాదని తేల్చి చెప్పి మరోమారు ఎప్పుడెప్పుడా అని జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశను మిగిల్చారు .
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications