చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదంటే..!
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. జైలులో కాకుండా హౌస్ రిమాండ్ విధించాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును కోరారు. అయితే దేశవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ చర్చనీయాంశమవగా ఆయనకు మద్దతుగా కొందరు రోడ్లపైకి చేరి నిరసనలు తెలియజేస్తున్నారు.
అన్నిరకాలుగా, అన్నివైపుల నుంచి మద్దతుగా ఉండేవారు చంద్రబాబు తరఫున స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి మాత్రం స్పందన లేకపోవడం చర్చకు దారితీస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తారక్ ఎందుకు స్పందించడంలేదు? అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. కొన్ని సంవత్సరాలుగా జూనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.

కొన్ని సమయాలలో తెలుగుదేశం పార్టీపై ఎన్టీఆర్ స్పందించిన తీరును కొందరు వివాదాలకు దారి తీసేలా చేశారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే తారక్ చంద్రబాబు అరెస్ట్ విషయంపై స్పందించే అవకాశాలు లేవంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా ఎదిగాడు. ఇటువంటి తరుణంలో రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రస్తుతం తారక్ భావించడం లేదని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో ఏ కామెంట్స్ చేసినా వివాదాలకు దారితీస్తుందని, అలా కాకుండా మౌనంగా ఉండటమే ఉత్తమమని జూనియర్ భావించే దూరంగా ఉంటున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications