కల్యాణ్ రామ్ కోసం బ్లాక్ బస్టర్ వదులుకున్న జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. కథలకు సంబంధించిన జడ్జిమెంట్ విషయంలో తారక్ ఎంతో అనుభవంతో వ్యవహరించడమేకాదు.. పర్ ఫెక్ట్ అనిపిస్తారు. తన కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఘోరంగా డిజాస్టర్ అయిన సినిమాలు తక్కువే ఉంటాయి. కల్యాణ్ రామ్ కెరీర్ పరంగా సక్సెస్ అవడానికి తారక్ ఎంతో కష్టపడ్డారు. అంతేకాదు ఆర్థికంగా స్థిరపడటానికి కూడా తనవంతు సహాయ సహకారాలు అందించారు.
కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్లలో పటాస్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కథను అనిల్ మొదట తారక్ కు చెప్పారు. అయితే తారక్ అప్పటికే టెంపర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో పటాస్ సినిమాను కళ్యాణ్ రామ్ తో చేయాలని అనిల్ కు సూచించడంతో పటాస్ కథ కళ్యాణ్ రామ్ కు దగ్గరకు వెళ్లడం, అతనికి కూడా నచ్చడంతో సెట్స్ పైకి వెళ్లింది.

కెరీర్ లో అలా కల్యాణ్ రామ్ పుంజుకోవడంలో ఎన్టీఆర్ తనవంతు పాత్ర పోషించారు. అంతేకాదు.. కల్యాణ్ రామ్ సినిమాలు ఆర్థికంగా నష్టాలను మిగిల్చిన సమయంలో కూడా జై లవకుశ సినిమా ద్వారా జూనియర్ కల్యాణ్ రామ్ ను నిర్మాతగా నిలదొక్కుకునేలా చేశారు. బింబిసార సినిమాతో కల్యాణ్ రామ్ నిర్మాతగా మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కు ఈ సినిమా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం రూ.100 కోట్లగా ఉండగా, కల్యాణ్ రామ్ పారితోషికం రూ.10 కోట్ల రేంజ్ లో ఉంది. వీరిద్దరూ కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూద్దాం.












Click it and Unblock the Notifications