చంద్రబాబుకు షాక్.. టీడీపీ సభలో ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం
ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ .. రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం చంద్రబాబు పార్టీ అధ్యక్షడుగా తప్పుకుని జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి బాధ్యతలు ఇవ్వాలని సలహా ఇచ్చారు.
చంద్రబాబు మాత్రం నారా లోకేష్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని తేల్చేశారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి అభిమానులు పాలాభిషేకం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. అభిమానులు అక్కడితో ఆగకుండా టీడీపీ నేతల ముందే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు ఇలా చేయడం టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల విషయంలో ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉంటున్నా ఆయన అభిమానులు మాత్రం అస్సలు సైలెంట్‌గా ఉండటం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుకు భలే షాకిచ్చారుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారాయన. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు.
#Chittoor Yesterday night in TDP rally.@tarak9999 👑 pic.twitter.com/XTGVOn959g
— A҉ 🇮🇳 (Modi Ka Parivar) (@Anusha_Cv_NTR) April 30, 2024
కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం.. ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టిని సారించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను టీడీపీ దూరం పెట్టడంతో ఆయన అభిమనులు కొందరు జగన్‌కు మద్దతు ప్రకటించారు.












Click it and Unblock the Notifications