కొడాలి నానీ, వల్లభనేని వంశీలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు: నందమూరి చైతన్యకృష్ణ వార్నింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కు కారణంగా మారాయి. 2024 లో జరిగిన ఈ ఎన్నికలలో అధికార పీఠాన్ని చేపట్టడానికి వైసిపి శతవిధాల ప్రయత్నం చేస్తే, వైసీపీని గద్దె దించడానికి టిడిపి జనసేన బిజెపిల కూటమి అంతే బలంగా పనిచేసింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
నందమూరి ఫ్యామిలీలో పొలిటికల్ రగడ
ఇక ఇదే సమయంలో ఎన్నికలలో ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్నటికి మొన్న మెగా ఫ్యామిలీలో ఎన్నికలలో మద్దతు గురించి నాగబాబు, అల్లు అర్జున్ ల మధ్య రచ్చ కొనసాగగా, తాజాగా ఎన్నికలలో మద్దతు గురించి నందమూరి ఫ్యామిలీ లోను రగడ కొనసాగుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీకి అనుకూలంగా పని చేశారు
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీకి అనుకూలంగా పనిచేశారని నందమూరి చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో జూనియర్ ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ లో ఉన్న కలహాలను చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో గత ఐదేళ్ల కాలంలో అనేక సంఘటనలు జరిగినా జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నారు.
నందమూరి ఫ్యామిలీకి, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్
చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినా, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును జైలుకు పంపించిన జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపలేదు. తనకేమి పట్టదు అన్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు, నందమూరి ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ ఉన్నట్టు అనేక సందర్భాలలో చర్చ జరిగింది.
కొడాలి నాని, వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని నందమూరి చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతు ఇచ్చారని చెబుతున్నారని, మీరెవరూ.. మమ్మల్ని ఏం పీకలేరు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నేనుండగా చంద్రబాబు, బాలకృష్ణ లను టచ్ చెయ్యలేరు
నేనుండగా చంద్రబాబునాయుడు మామయ్యను, నందమూరి బాలకృష్ణ బాబాయిని టచ్ కూడా చేయలేరు అంటూ చైతన్య కృష్ణ పోస్ట్ పెట్టారు. తన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైఎస్ఆర్ సీపీ కలిసి తనని ట్రోల్ చేశారని గుర్తు చేసిన ఆయన, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలంటూ హితువు పలికారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications