Jr Ntr: నారా, నందమూరి కుటుంబ సభ్యుల విజయాలపై జూనియర్ ట్వీట్..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా విజయం సాధించారు. దీనిపై ఇవాళ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఇప్పటికే టీడీపీకీ, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం నేపథ్యంలో తన కుటుంబానికి చెందిన వీరందరికీ శుభాకాంక్షలు చెప్తూ తారకరామారావు ట్వీట్ చేశారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) June 5, 2024
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…

జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్ లో ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, అత్త పురందేశ్వరికి శుభాకాంక్షలు అంటూ ముగించారు.
ఈసారి ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది. అంతే కాదు ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగించాల్సిన అవసరం వస్తుందనేలా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. అలాగే వైసీపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా చాలా ప్రచారం చేసింది. ఆయన అభిమానులు కూడా వైసీపీని సమర్థించారు. చివరికి ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో వారంతా సైలెంట్ అయిపోయారు.












Click it and Unblock the Notifications