నారా లోకేష్‌కు కేఏ పాల్ బంపర్ ఆఫర్!: సంచలన వ్యాఖ్యలు

క్రైస్తవ మత ప్రచారకుడు, డా. కేఏ పాల్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తానే ప్రచారం చేస్తానంటూ ట్వీట్ చేశారాయన.

హైదరాబాద్‌: క్రైస్తవ మత ప్రచారకుడు, డా. కేఏ పాల్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా ఏపీ ప్రభుత్వంలోకి అడుగుపెట్టు. ఎమ్మెల్సీగా రావాల్సిన అవసరం ఏముంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌నే గెలిపించాను. అలాంటిది ఈ ఎమ్మెల్సీ ఎంత? నీకోసం ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిపించలేనా?' అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.

KA Paul satirical comments on Nara Lokesh

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్‌.. ఎమ్మెల్సీగా రావొద్దని, ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని సూచించారు కేఏ పాల్. అవసరమైతే తానే స్వయంగా లోకేశ్‌ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకుంటానని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ప్రచారం చేసి గెలిపించినట్లుగానే లోకేశ్‌కు ప్రచారం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో లోకేశ్‌ ఏమాత్రం వెనకడుగు వేయోద్దంటూ సూచించారు.

కాగా, తన సామర్థ్యాన్ని గుర్తించి పొలిట్‌ బ్యూరో తనకు ఎమ్మెల్సీ బాధ్యతలు కట్టబెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు బదులిస్తున్నట్లు.. కేఏ పాల్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+