Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కడప బాలిక గ్యాంగ్ రేప్: చేతకాని ముఖ్యమంత్రి, హోం మంత్రి అంటూ అనిత ఆగ్రహం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ కడప జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఏపీ రాజకీయాల్లో దుమారం గా మారింది. తాజాగా టిడిపి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ సర్కార్ ను, హోం మంత్రి తానేటి వనిత టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సీఎం కావాలనే ఒకే ఒక టార్గెట్ తో అక్క, చెల్లెమ్మలను మోసం చేసి ఓట్లేయించుకొని సీఎం అయిన తరువాత అదే చెల్లెమ్మలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగినా ఆయనకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు అంటూ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.

జగన్ తో పాటు హోం మంత్రిని టార్గెట్ చేసిన అనిత

జగన్ తో పాటు హోం మంత్రిని టార్గెట్ చేసిన అనిత

రాష్ట్రంలో మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా తాడేపల్లి ప్యాలెస్ ను వదలి రాడు జగన్ అంటూ అనిత అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలకు కామాలే తప్ప పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి ఉందని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు యాధృచ్ఛికమని హోం మంత్రి మాట్లాడటం హోం మంత్రి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అంటూ వంగలపూడి అనిత హోం మంత్రి తానేటి వనిత ను టార్గెట్ చేశారు.

చేతకాని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్

చేతకాని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్

జగన్ సర్కార్ పాలనలో బాధ్యతారాహిత్యం, చేతకానితనం, నిస్సహాయత, రాజకీయ అనుభవం లేకపోవటం, పరిపాలనపై పట్టు సాధించలేకపోవటంతోనే రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. చేతకాని ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్ అంటూ అనిత వ్యాఖ్యానించారు. ఇటువంటి సంఘటనలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పా ఏ రాష్ట్రంలోనూ జరగడంలేదని అనిత పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనలను అనిత ఏకరువు పెట్టారు.

 సీఎం జగన్ సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?

సీఎం జగన్ సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?

కామాంధుల అఘాయిత్యాలను అరికట్టలేని స్థితిలో ప్రభుత్వముందని మండిపడిన అనిత. డీజీపీ, సీఎం కు చెందిన కడప జిల్లాలో 15 సంవత్సరాల ఆడబిడ్డపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 6 నెలల గర్భవతి అయినా పోలీసులు నిర్లక్షం చేశారు. వారి జిల్లాలోని ఆడబిడ్డలకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఎలా రక్షణ ఉంటుంది? అంటూ ప్రశ్నించారు. హోం మంత్రికి ఆ పదవి రావడం యాదృచ్ఛికమేమో కానీ అత్యాచారాలు జరగడం యాదృచ్చికం కాదని అనిత పేర్కొన్నారు. హోంమంత్రి బాధితురాళ్ల తల్లుల తప్పుల గురించి మాట్లాడటంలో అర్థంలేదన్నారు.

 జగన్ సీఎం స్థానానికి అనర్హుడు

జగన్ సీఎం స్థానానికి అనర్హుడు


లేని దిశ చట్టంపై రివ్యూలు జరుపుతారుగానీ పోతున్న మాన, ప్రాణాలపై రివ్యూ పెట్టరు. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పోరాడుతున్న ప్రతిపక్షాలను నానా యాగి చేస్తున్నారనడం హాస్యాస్పదం అంటూ అనిత మండిపడ్డారు. జగన్ సీఎం స్థానానికి అనర్హుడు.. నిందితులను శిక్షించాలనే, ఆడబిడ్డలను కాపాడుకోవాలి అనే చిత్తశుద్ది ఉంటే తాడేపల్లి ప్యాలెస్ నుండి ముఖ్యమంత్రి బయటికి రావాలన్నారు వంగలపూడి అనిత. టిడిపి నాయకుల పై కేసులు పెట్టడం లో చూపే శ్రద్ధ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.

గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని చెప్పిన మహిళా నేతలు ఏమంటారు

గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని చెప్పిన మహిళా నేతలు ఏమంటారు

తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలడు అనిత నిలదీశారు. మహిళా ప్రజా ప్రతినిధులు బయటికొచ్చి జగనన్న జపం మాని జనాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. చంద్రబాబు, లోకేశ్ లను విమర్శించడం ఒకఎత్తైతే జగన్ ను పొగడడం మరో ఎత్తు అంటూ మండిపడ్డారు. ఇంతమంది పై అఘాయిత్యాలు జరుగుతున్నా ఎందుకు నోరు విప్పటంలేదు? ఏ ఆడపిల్లపైనైనా అఘాయిత్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ ఉంటాడని సినిమా డైలాగ్ చెప్పారు. గన్ కల్చర్ అయితే వచ్చింది కానీ జగన్ రావడంలేదు అని అనిత విమర్శించారు. గడప గడపకి వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఈ మూడు సంవత్సరాల్లో అఘాయిత్యాలతో చనిపోయిన ఆడబిడ్డల ఇళ్ల గడప గడపకి వెళ్ళి పరామర్శించండి అంటూ అనిత హితవు పలికారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+