మందు, విందు, పొందు!: అడ్డంగా దొరికిపోయారు, కడప బ్యాంక్ మేనేజర్ రాసలీలలు

అమరావతి: కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు రాసలీలల వీడియో ఇప్పుడు మీడియాలో హాల్ చల్ చేస్తోంది. అర్హత ఉన్నా లేకున్నా ఆయన వద్ద అడ్డదారి తొక్కితే చాలు. మందు, మగువను ఎరగా వేస్తే ఎటువంటి రుణానికైనా ఇట్టే సంతకం పెట్టేస్తారంట.

అంతేకాదు ఆ రెండింటి కోసం ఎక్కడికి రమ్మన్నా ఎగురుకుంటూ వచ్చేసి, అక్కడే రుణాన్ని మంజూరు చేస్తారంట. కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లుకు ఉన్న 'పేరు ప్రఖ్యాతులు' ఇవి. ఈ వ్యాఖ్యలకు నిజం చేకూర్చేలా ఓ గుర్తు తెలియని యువతితో వెంకటేశ్వర్లు నడిపిన రాసలీలల దృశ్యాలు లీక్ అయ్యాయి.

మూడు, నాలుగు నెలల క్రితం ఈ వీడియోని చిత్రీకరించినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారం కాస్త ఈ నోటా ఆ నోటా పడి చివరకు వెంకటేశ్వర్లుకు చేరింది. ఇంకేముందు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు చేసేదే ఈయన చేశారు. వెంటనే సెలవుపై వెళ్లారు.

kadapa sahakara bank general manager caught on video

తిరిగి మళ్లీ విధుల్లోకి చేరిన తర్వాత కొంతకాలానికి ఈ రాసలీలల దృశ్యాలు బయటపడ్డాయి. దీంతో 'ఆ వీడియో నాది కాదు. బినామీ రుణాలకు సహకరించలేదన్న అక్కసుతో కొందరు ఇలాంటి తప్పుడు వీడియోలు సృష్టించారు' అని ఆయన తెలిపారు.

నిజానికి కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులే వెంకటేశ్వర్లుని కావాలని పట్టించారనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఈయన సహచర ఉద్యోగులపై వేధింపులకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+