పవన్ కల్యాణ్ జనసేనపై కాజల్ అగర్వాల్ సెటైర్లు?
సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీబిజీగా ఉన్నారు. కొద్దికాలం మాత్రం పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కాజల్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ వస్తోంది. తాజాగా సత్యభామ సినిమాద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది.
అందులో కాజల్ పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఫైట్స్ చెయ్యడం ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. టీజర్ లో మాత్రం ప్రజాసేన అనే పార్టీకి సంబంధించిన బ్యానర్ ఒకటి కనిపిస్తోంది. వాస్తవ జీవితంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీని పోలివుందని, జనసేనపై సెటైర్లు వేస్తోందంటూ పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

ఈ బ్యానర్ కు ప్రజాసేన అనే పేరు ఉండటమే కాకుండా, జనసేన పార్టీలో పిడికిలిని పోలినట్టు ఈ ఫ్లెక్సీలో కూడా పిడికిలి ఉండటంతో కచ్చితంగా ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించి పెట్టారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాజల్ ఉద్దేశపూర్వకంగానే జనసేనపై సెటైర్స్ వేస్తూ ఇలాంటి పోస్టర్ పెట్టారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెకు తెలియకుండా ఇదంతా జరిగుండొచ్చనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
ఇదంతా కావాలనే చేసినట్లుగా అర్థమవుతోందంటూ పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో కూడా కాజల్ నటించారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తోంది. ఇటువంటి సమయంలో కాజల్ అగర్వాల్ సీనియర్ల పక్కన చక్కగా ఒదిగిపోతున్నారు. భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ఇది నిరూపితమైంది.












Click it and Unblock the Notifications