'కన్నా' చేరిక.. BJPకి 'షేర్' చేసిన చంద్రబాబు?

రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని పోటీచేయడం ఖాయమైన నేపథ్యంలో టీడీపీ, జనసేన నుంచి అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా వచ్చిన ఏ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా ఎన్నికల్లో గెలుపు కోసమే ఉపయోగిస్తున్నారు. తాను ఒకవైపు జిల్లాల పర్యటనలు చేస్తుండగానే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండటంతోపాటు నియోజకవర్గాల ఇన్ ఛార్జిలంతా ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు.

అధికారిక ప్రకటనే తరువాయి?

అధికారిక ప్రకటనే తరువాయి?

రాబోయే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని పోటీచేయడం ఖాయమైన నేపథ్యంలో అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. జనసేనకు కేటాయించాల్సిన నియోజకవర్గాలేంటి? అన్న విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టతతోనే ఉంది. టీడీపీ, జనసేన ఎన్నికల చివరి వరకు బీజేపీతో పొత్తు కోసం వేచిచూద్దామని నిర్ణయించుకున్నారు. అయితే అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దాదాపుగా ఈ రెండు పార్టీలే కలిసి పోటీచేసే అవకాశం ఉంది. బీజేపీ పొత్తులో కలవకపోతే కమ్యూనిస్టులను కలుపుకునే అవకాశం కనపడుతోంది.

పచ్చజెండా ఊపిన చంద్రబాబు

పచ్చజెండా ఊపిన చంద్రబాబు

భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా టీడీపీలో చేరబోతున్నారు. బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందుకు రాదు అనే విషయంలో స్పష్టత ఉన్న చంద్రబాబు కన్నా చేరికకు అంగీకరించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిని ఒకవేళ ఆ పార్టీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం ఉంటే చేర్చుకునేవారు కాదని, ఆ నమ్మకం లేదుకాబట్టే కన్నా చేరికకు పచ్చజెండా ఊపారంటున్నారు.

కన్నా చేరికే ఒక ఉదాహరణ

కన్నా చేరికే ఒక ఉదాహరణ

తమకు జనసేనతోనే పొత్తుంటుందని చెబుతున్న బీజేపీ.. ఒకవేళ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలతోనే తమకు పొత్తుంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. స్థానిక నాయకత్వం కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఇష్టపడంలేదు. పొత్తుల సంగతి తేల్చాల్సింది కేంద్ర నాయకత్వమే అయినప్పటికీ వారు సానుకూలంగా ఉన్నారా? ప్రతికూలంగా ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయిన ప్రధానమంత్రి మోడీ ఎన్నికలకు 6 నెలల ముందు పొత్తుల గురించి ఆలోచించవచ్చని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబుకు బీజేపీ పొత్తులతో ముందుకు వస్తుందనే నమ్మకం కలగకపోవడమనేదానికి కన్నా చేరిక ఒక ఉదాహరణ అని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+