టీడీపీ,జనసేన పొత్తులో బిగ్ ట్విస్ట్ - పవన్ పై ఒత్తిడి, కొత్త స్కెచ్..!?

ఏపీ రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనుకుంటున్న వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ ఈ రెండు పార్టీల పొత్తు పైన అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదే సమయంలో బీజేపీ నిర్ణయం కీలకంగా మారుతోంది. పవన్ రానున్న ఎన్నికల్లో కింగ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కింగ్ లేదా కింగ్ మేకర్ గా మారేలా జనసేనాని పవన్ కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారని సమాచారం.

కింగ్..కింగ్ మేకర్ : ఏపీలో రాజకీయ పార్టీల పైన కర్ణాటక పొలిటికల్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. కర్ణాటకలో హోరా హోరీగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. కాంగ్రెస్ ఆధిక్యత పైన మెజార్టీ సంస్థలు అనుకూలంగా చెప్పినా.. మేజిక్ ఫిగర్ పైన మాత్రం సందిగ్థద కొనసాగుతోంది. ఈ సమయంలో మూడో పార్టీగా ఉన్న జేడీఎస్ కీలకంగా మారుతోంది. గతంలోనూ కర్ణాటకలో అస్పష్ట మెజార్టీతో కుమార స్వామి సీఎం అయ్యారు. కానీ, బీజేపీ..కాంగ్రెస్ రాజకీయాల నడుమ పదవి కోల్పోయారు. తిరిగి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అంచనాలతో మరోసారి కుమార స్వామి కింగ్ మేకర్ అవ్వనున్నారనే అభిప్రాయం జాతీయ మీడియాలో బలంగా వినిపిస్తోంది.

cbnpk

కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ : ఇప్పుడు కర్ణాటక తరహాలోనే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ గా అవకాశం వస్తే కింగ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య కొద్ది నెలల్లోనే మూడు సార్లు సమావేశం జరిగింది. రెండు పార్టీల నడుమ పొత్తు ఖాయమని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేలా ఆ పార్టీ నేతలతో పవన్ మంతనాలు సాగిస్తున్నారు. బీజేపీ కలిసి రాకపోయినా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి.

వేర్వేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి అనుకూలిస్తుందనేది పవన్ అంచనా. కానీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తే చంద్రబాబు సీఎం అవుతారు..పవన్ కు ప్రభుత్వం లో భాగస్వామ్యం దక్కటం మినహా.. కింగ్ కాలేరనే అభిప్రాయం ఉంది. పవన్ ఈ ఎన్నికల్లో కింగ్ అయ్యేలా కుమార స్వామి తరహాలో అవకాశం దక్కేలా వ్యవహరించాలని పవర్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

 pawan

కీలకంగా మారే అవకాశం : ఏపీలో వైసీపీ..టీడీపీ మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. పవన్ టీడీపీతో కలివటం ద్వారా కొన్ని సీట్లలో జనసేన పోటీ చేయటం.. అధికారంలోకి వస్తే మంత్రి పదవులు మినహా భవిష్యత్ కు ప్రయోజనం ఉండదనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ సమయంలో పవన్ సొంతగా పోటీ చేసి చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు సాధిస్తే టీడీపీ అధికారంలోకి రావటానికి కింగ్ మేకర్ గా సహకరించే స్థానంలో పవన్ కింగ్ అయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

దీంతో పవన్ కొత్త వ్యూహంతో ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదనే చర్చ మొదలైంది. మరి పవన్ అందుకు సిద్దపడతారా.. దైర్యంగా ముందుకు వెళ్లి కింగ్ గా నిలిచే అవకాశం దక్కించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+