వైరల్ గా మారిన కావ్యమారన్ వీడియో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వరుసగా రెండో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. కొత్త కెప్టెన్ గా మార్‌క్రమ్ బాధ్యతలు చేపట్టినా లక్నో జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసిన 121/8 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ.. సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
హైదరాబాద్ నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో బ్యాటర్లు రంగంలోకి దిగారు. మంచి ఫామ్‌లో ఉన్న కైల్ మేయర్స్ రెండు ఫోర్లు కొట్టాడు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా భారీ స్కోరు చేస్తాడని అందరూ అనుకున్నారు.

అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఫరూఖి వేసిన బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి మయాంక్ అగర్వాల్ చేతికి చిక్కి ఔటవక తప్పలేదు. దీంతో మంచి ఊపుమీదున్న మేయర్స్ 13 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో కావ్యామారన్ ఆనందంతో చేసిన హంగామా వైరల్‌గా మారింది. చివరికి మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆమె సంతోషమంతా ఆవిరైపోయింది.
Intha andamaina pilla ni yedipiyakandra plz 🥰 #kavyamaran #SunrisersHyderabad pic.twitter.com/7AtPCRs1XI
— AjayKumar (@Ajaythumati) April 7, 2023












Click it and Unblock the Notifications