బైరెడ్డి ఎఫెక్ట్: కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవం

Subscribe to Oneindia Telugu

  కర్నూలు MLC స్థానానికి ఉప ఎన్నిక...!

  అమరావతి/కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కేఈని ఎమ్మెల్సీగా ప్రకటించారు.

  నిన్నమొన్నటి వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికలు చివరకు ఏకగ్రీవమైంది. కేఈతోపాటు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, ఓ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తిరస్కరించింది.

  KE Prabhakar unanimously elected as Kurnool MLC

  ఇక ఎంపీటీసీల సంఘం నేత జయప్రకాశ్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మాట్లాడారు. ఆ తర్వాత జయప్రకాశ్ రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కావడం గమనార్హం.

  జగన్ మాటతో వెనక్కి తగ్గిన వెంకటరెడ్డి: అయినా పోటీ తప్పదా!, నామినేషన్ దాఖలు

  ఈ సమావేశంలో బైరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు బైరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి అనుచరుడైన జయప్రకాశ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో కేఈ ప్రభాకర్ మాత్రమే నిలిచినట్లయింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  It is said that TDP leader KE Prabhakar unanimously elected as Kurnool MLC.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి