వంగవీటి రాధాతో కేశినేని చిన్ని కీలక భేటీ.. కేశినేని నానీతో వార్ వేళ..అందుకేనా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కృత నిశ్చయంతో ఉన్న నేతలు ఎన్నికల్లో విజయం సాధించడం కోసం, తమకు సహకారం అందించే నేతలకు దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ, కులాల వారీగా ఓటు బ్యాంకును బేరీజు వేసుకుంటూ, తదనుగుణంగా రాజకీయాలను చేస్తున్నారు.

వంగవీటి రాధాను కలిసిన కేశినేని చిన్ని
ఇక తాజాగా విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ టిడిపి కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న వంగవీటి రాధా తో భేటీ అయ్యారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీలో ఉన్న కేశినేని చిన్ని ఆయనతో ఈ ఎన్నికల్లో తనకు సహకారం అందించాలని, భేటీలో మాట్లాడినట్టు తెలుస్తుంది.

Kesineni Chinni key meeting with vangaveeti radha key update in bejawada politics

తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాతో భేటీ
బెజవాడ పాలిటిక్స్ లో వంగవీటి రాధాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం లోను,విజయవాడ సెంట్రల్ లోను వంగవీటి రాధాకు మంచి గ్రిప్ ఉంది. ఈ క్రమంలో ఆయన సహకారాన్ని కోరుతూ కేశినేని చిన్ని వంగవీటి రాధా తో భేటీ అయ్యారు. కేశినేని నానిని ధీటుగా ఎదుర్కోవటం కోసం వంగవీటి రాధా సహకారాన్ని కేశినేని చిన్ని కోరినట్టు సమాచారం.

అధికారంలోకి వచ్చాక వంగవీటి రాధాకు సముచిత స్థానం
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా వంగవీటి రాధా రాష్ట్రమంతా తన సేవలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాకి సముచితస్థానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిస్వార్ధ ప్రజానాయకుడు, కల్మషం లేని మనిషి వంగవీటి రాధా అని, కృష్ణాజిల్లాతో పాటుగా, రాష్ట్రమంతటా, తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధా సేవలు మరింత ప్రయోజనకరమని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

కేశినేని చిన్ని వర్సెస్ కేశినేని నాని
కేశినేని చిన్ని ఈసారి జరగనున్న ఎన్నికలలో పార్లమెంటు నియోజకవర్గం నుండి కేశినేని నానితో తలపడనున్నారు. గతంలో టీడీపీలో ఎంపీగా ఉన్న కేశినేని నాని తన సోదరుడితో వివాదాల నేపధ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు కేశినేని చిన్నికి ప్రాధాన్యత ఇవ్వటంతో పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ నుండి ఈ దఫా ఎన్నికల బరిలోకి దిగారు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఈ వార్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+