టీడీపీలో వైసీపీ కోవర్టుగా కేశినేని నాని-ఆధారాలివిగో.. కేశినేని చిన్ని విమర్శలు..
టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లాక చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలకు దిగుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని ఇవాళ విరుచుకుపడ్డారు. కేశినేని నానిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనో వసూల్ రాజా అన్నారు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్టుగా ఆయన ఎలా పనిచేశారో వివరించారు. తన వద్ద నాని కాల్ రికార్డ్స్ సహా అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
కేశినేని నాని ఓ ఊసరవెల్లి అని సోదరుడు కేశినేని చిన్ని ఆరోపించారు. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశాడన్నారు. ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి నాని చేరవేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడని చిన్ని తెలిపారు.

Recommended Video

విజయవాడ పశ్చిమ సీటులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని కేశినేని చిన్ని మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. వారు ఇప్పుడు డబ్బులు తిరిగి ఇచ్చేయమని ననిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.కేశినేని నాని కాల్ రికార్డ్స్ ఉన్నాయని, కేశినేని నాని వసూలు రాజా అని చిన్ని విమర్శించారు. తనను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారన్నారు.
జగన్ వద్ద, వైసీపీ ఇన్చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారంటూ చిన్ని తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నానిది సైకో మనస్తత్వమని, విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదని చిన్ని పేర్కొన్నారు. అవినాష్, వెలంపల్లి వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ పని చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications