రామ్ చరణ్ ఉపాసన నిజస్వరూపం చెప్పిన క్లీంకార కేర్ టేకర్!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కొణిదల కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. రాంచరణ్ ఉపాసన జంట పైన సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక తాజాగా రామ్ చరణ్ ఉపాసన ఫ్యాన్స్ కు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పారు క్లీంకార కేర్ టేకర్ లలిత.

రాం చరణ్ ఉపాసన గురించి చెప్పిన ఆయా
రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల పట్టి క్లీంకార ను చూసుకోవడం కోసం అంబానీ ఫ్యామిలీతో పాటు ఎంతోమంది స్టార్ కిడ్స్ కు ఆయాగా పనిచేసిన లలితను ముంబై నుంచి తీసుకొచ్చుకొని తమతో పాటు ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె రామ్ చరణ్ ఉపాసనల గుణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఇద్దరూ మంచి మనసు ఉన్న వారిని లలిత పేర్కొన్నారు.

Klinkaara care taker who told the real nature of Ram Charan Upasana

పని చేసే ఆయాను ఫ్యామిలీ మెంబర్ లా
పాప క్లీంకార విషయంలో వాళ్లు ఎంతో జాగ్రత్తగా ఉంటారని, పాపని చాలా చక్కగా చూసుకుంటారని పేర్కొన్నారు. తాను ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లల్లో ఆయాగా పనిచేశానని, తాను ఎక్కడ పని చేసినా తనను ప్రతి ఒక్కరూ వారి ఫ్యామిలీలోకి గొప్ప మనసుతో స్వాగతించారని పేర్కొన్నారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా తనను ఒక ఆయాగా కాకుండా కుటుంబ సభ్యురాలులాగా తమ ఫ్యామిలీలోకి స్వాగతించారని పేర్కొన్నారు.

ముంబైకి హైదరాబాద్ కి తేడా చెప్పిన క్లీంకార ఆయా
తాను ప్రస్తుతం క్లీంకార ను చూసుకుంటున్నానని లలిత పేర్కొన్నారు. అయితే ముంబైకి హైదరాబాద్ కి ఉన్న వ్యత్యాసాన్ని చెప్పిన లలిత కేవలం ఆహార పద్ధతులలో మినహాయించి, మిగతా అన్ని విషయాలలోనూ పెద్దగా తేడా లేదన్నారు. కొణిదల ఫ్యామిలీ దక్షిణాదికి చెందింది కాబట్టి వారి ఆహార అలవాట్లు వేరుగా ఉంటాయని, తన ఆహార అలవాట్లు వేరని పేర్కొన్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనది
తాను రెస్ట్ తీసుకునే సమయంలో పాపను ఉపాసన చూసుకుంటారని, ఉపాసన అందరితోనూ కలివిడిగా ఉండే మనిషి అని తెలిపారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉపాసనదని, తను చాలా సింపుల్ గా ఉంటారని పేర్కొన్నారు తరచూ పాపని ఎత్తుకోమని లేదా జాగ్రత్తగా చూసుకోమని తనను ఏ విధంగాను బలవంతం చేయరని, తనను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారని లలిత ఉపాసన రాంచరణ్ ల మంచి మనసులకు కితాబిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+