కొడాలి నాని రాక్స్..రిపోర్టర్ షాక్..ర్యాగింగ్ మామూలుగా లేదుగా..!
వైసీపీ కీలక నేతల్లో కొడాలి నాని కూడా ఒకరు.జగన్ మంత్రివర్గంలో ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు.అయితే గత ఎన్నికల్లో కొడాలి నాని తొలిసారి ఓడిపోవడం జరిగింది.ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని సైలెంట్ అయ్యారు. జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు.ఒకనొక సమయంలో కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారనే ప్రచారం కూడా జరిగింది.అయితే అలాంటిది ఏమీ లేదని ఆయన ప్రకటించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడంతో పార్టీ అధినేత జగన్ ఆయనతో ములాఖత్ కావడానికి మంగళవారం విజయవాడకు వచ్చారు.ఈక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలంతా విజయవాడకు చేరుకున్నారు. కొడాలి నాని సైతం జగన్‌తో భేటీ అయ్యారు.చాలాకాలం తర్వాత కొడాలి నాని బయట కనిపించారు.ఈ సమయంలో ఓ ప్రముఖ ఛానెల్ రిపోర్టర్ కొడాలి నానితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్నాళ్లు ఎక్కడకు వెళ్లారని కొడాలి నానిని రిపోర్టర్ ప్రశ్నించగా, ఎక్కడకు వెళ్లడం ఏంటమ్మా..మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజు మీ ఇంటికి వచ్చి కనిపించి వెళ్తా అంటూ ఆయన సెటైర్లు వేశారు. గతంలో యాక్టివ్‌గా ఉండేవారు..ఇప్పుడు బయటకు ఎందుకు రావడం లేదని సదరు యాంకర్ ప్రశ్నించారు.

అప్పుడంటే ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి ఉండేవాళ్లం , ఇప్పుడు ఎందుకు యాక్టివ్‌గా ఉంటామని అని ఆయన ఎదురు ప్రశ్నించారు.అరెస్ట్ చేస్తారనే భయంతోనే బయటకు రావడం లేదా అని రిపోర్టర్ కొడాలి నానిని ప్రశ్నించగా, నీ ఉద్యోగం పీకేస్తే నువ్వు మైక్ పట్టుకుని రిపోర్టింగ్ చేస్తావా అంటూ ఆయన కౌంటరిచ్చారు.
వల్లభనేని వంశీని అరెస్ట్‌ను ఎలా చూస్తారంటే, అరెస్ట్ లాగే చూస్తానంటూ రిపోర్టర్‌కు చురకలు అంటించారు.మీపై గుడివాడలో మూడు కేసులు నమోదయ్యాయని అడగ్గా, మూడు కాకపోతే, ముప్పై పెట్టుకోమను ఎవరొద్దన్నారని కొడాలి నాని సమాధానం ఇచ్చారు.రెడ్ బుక్‌లో మీ పేరు ఉందని అంటున్నారని అడగ్గా, నాకు చూపించలేదు.. నీకు ఏమైనా చూపించారా అంటూ కొడాలి నాని తిరిగి ప్రశ్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.పాపం ఆ రిపోర్టర్ ఇంకెప్పుడు కొడాలి నానితో ఇంటర్వ్యూ చేయదంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications