రాజీనామాకు సిద్దం - చంద్రబాబు డిసైడ్ చేయాలి : కొడాలి నాని..!!
చంద్రబాబుకు కొడాలి నాని సవాల్ చేసారు. రాజీనామాకు సిద్దమని, ఎక్కడ రావాలో చెప్పాలని ఛాలెంజ్ చేసారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. రెండు గ్లాసులు, నాలుగు కుర్చీలు, ఒక కంప్యూటర్ ధ్వంసమైనందుకు పరామర్శకు చంద్రబాబు గన్నవరం వెళ్లారని ఎద్దేవా చేసారు. పిచ్చిపట్టినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రికి ఛాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు. పోలీసుల భద్రత లేకుండా కాలు కూడా కదపలేని చంద్రబాబు.. గన్నవరం వెళ్లి పోలీసు అధికారులను నోటికి వచ్చినట్టుగా తిడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నీచపు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 76 ఏళ్ల వయసులో కొట్టుకుందాం పోలీసులు లేకుండా రా అని ముఖ్యమంత్రికి ఛాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పిచ్చి ఛాలెంజ్‌లకు ముఖ్యమంత్రి జగన్ స్పందించరన్నారు. సీఎం జగన్ రాజ్యాంగ మీద..ప్రజల మీద....దేవుడి మీద నమ్మకంతో పరిపాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. బ్లాక్ క్యాట్స్ వద్దని కేంద్రానికి లేఖ రాయాలన్నారు. తాను.. వంశీ ఇద్దరిలో ఒకరు తమకున్న సెక్యూరిటీని వదిలేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తామని స్పష్టం చేసారు. చంద్రబాబు ఎక్కడకు రమ్మంటే అక్కడికి వస్తామని తేల్చి చెప్పారు. నల్లమల ఫారెస్టా.. లేక మచిలీపట్నం వద్ద సముద్రంలో 20 కిలోమీటర్లు వెళ్లిన తరువాత పడవల్లో కొట్టుకుందామా..ఛత్తీస్‌గడ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా..అంటూ కొడాలి నాని ఛాలెంజ్ చేసారు.

చంద్రబాబు రెండు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉండి బాలకృష్ణ సినిమాలు చూస్తున్నట్టున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. బాలయ్య చంద్రబాబు మీద పూనినట్టున్నారని ఎద్దేవా చేసారు. ఆయన సినిమాల్లో చెబుతుంటే.. చంద్రబాబు మైక్‌ల ముందు డైలాగ్‌లు చెబుతున్నారని చెప్పుకొచ్చారు. బాబు పిచ్చిమాటలకు తమ్ముళ్లు రెచ్చిపోయి పోలీసులను, ప్రెస్ వాళ్లను ఎవరు అడ్డం వస్తే వారిని కొడుతున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. గన్నవరానికి పట్టాభిని పంపించింది చంద్రబాబే అని చెప్పారు. ఇరు పార్టీలను కంట్రోల్ చేసిన పోలీసులకే దెబ్బలు తగిలాయని వివరించారు. పోలీసుల భద్రత లేకుండా అడుగు కూడా వేయలేని చంద్రబాబు.. ఆ పోలీసులనే నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పోలీసులకు మతం రంగు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications