పవన్ కుల మతాలు వద్దు.. రెండు చోట్ల ఓడిన నీకు జగన్ సమాధానం చెప్పాలా? కొడాలి నాని

జనసేన అధినేత పవన్ కళ్యాన్ మీద కొడాలి నాని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి తిరుపతి ప్రసాదం తింటారో లేదో అని అంటున్నారని.. ఆయన తిరుపతి వెళ్లినప్పుడు వచ్చి చూడాలని సూచించారు. జగన్ కులం.. మతం గురించి పవన్ కు ఎందుకు చెప్పాలని.. ఆయన అడగగానే జగన్ చెప్పాలా అని నిలదీసారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.

 కుల, మతాల గురించి వద్దని

కుల, మతాల గురించి వద్దని

పవన్ కళ్యాన్ గురించి విమర్శిస్తూ.. చంద్రబాబుకు ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ గురించి కులాలు మతాలు గురించి మాట్లాడుతారు. ఆయన చాలా గొప్పగా పుస్తకాలు చదివానని చెబుతుంటారు. విధి విధానాలు గురించే మాట్లాడుతాను అంటాడు. ఆయనకు విధి విధానాల గురించి ఆయనకు తెలుసా? అని ప్రశ్నించాడు. మతం, కులం గురించి మాట్లాడను అని చెప్పే ఆయన వాటి గురించే మాట్లాడటం చూస్తున్నాం అని కొడాల నాని ఎద్దేవా చేశాడు.

 పాదయాత్ర చేసే ముందు

పాదయాత్ర చేసే ముందు

తిరుపతి ప్రసాదం తింటాడా? లేదా అని ప్రశ్నించే పవన్ కళ్యాన్‌పై కొడాలి నాని మండిపడ్డారు. తిరుపతి ప్రసాదం తింటాడో లేదో ఆయనతో వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయడానికి ముందు తిరుపతికి వెళ్లి దర్శించుకొన్నాడు. ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాద యాత్ర పూర్తయిన తర్వాత ట్రైన్‌లో వచ్చి.. అలిపిరి నుంచి నడిచి వెళ్లి దేవుడిని దర్శించుకొన్నాడు. అలాంటి వ్యక్తి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం చూస్తే విడ్డూరంగా ఉంది అని కొడాలి నాని పేర్కొన్నాడు.

 రెండు చోట్ల ఓడిపోయి నీకు..

రెండు చోట్ల ఓడిపోయి నీకు..

గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిన వాడికి కులం, మతం గురించి సీఎం జగన్ సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను ఏమని పిలవాలో 151 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ చేయాలని చెబుతున్న పవన్..తన పార్టీ నుండి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన వారితో మీటింగ్ పెట్టుకొని ఏ పేరుతో పిలవాలో చెప్పాలని డిమాండ్ చేసారు. ఇంట్లో కళ్యాన్ బాబు అని పెడితే.. చిరంజీవి పవన్ కళ్యాణ్ గా మార్చారని..అభిమానులు పవర్ స్టార్ అని.. వైసీపీ నేతలు పవన్ నాయుడు అని..కొందరు ప్యాకేజీ స్టార్ అని పిలుస్తున్నారని..ఏ పేరుతో పిలవాలో డిసైడ్ చేసుకొని చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+