గుడివాడలో కొడాలినాని నామినేషన్ వివాదం.. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక నేడు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలించి నామినేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. నిబంధనల ప్రకారం సరిగ్గా లేని వాటిని రిటర్నింగ్ అధికారులు తిరస్కరిస్తారు. ఇక ఈ క్రమంలో గుడివాడ అసెంబ్లీ వైసిపి అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ విషయంలో ప్రస్తుతం గందరగోళం చోటుచేసుకుంది.
కొడాలి నామినేషన్ పై టీడీపీ ఫిర్యాదు
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం వైసిపి అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పై వివాదం చోటుచేసుకుంది. కొడాలి నాని నామినేషన్ లో తప్పుడు సమాచారం పెట్టారని రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే భవనాన్ని అద్దెకిచ్చినట్టు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు.

కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలి
తెలుగుదేశం పార్టీకి చెందిన తులసి ఫిర్యాదు చేస్తూ ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించ లేదని ఎన్నికల అఫిడవిట్ లో కొడాలి నాని పేర్కొన్నారని, కానీ ఆయన ప్రభుత్వ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా వినియోగించుకున్నారని వెల్లడించారు. ఇక తప్పుడు సమాచారం ఇచ్చిన కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.
రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఉత్కంఠ
అన్ని ఆధారాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడంతో కొడాలి నాని నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపైన సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. గుడివాడలో కొడాలి నానిని టార్గెట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొడాలి నాని వేస్తున్న అడుగులను, చేస్తున్న పనులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని అఫిడవిట్ లో ఉన్న తప్పులను గుర్తించి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు: కొడాలి నాని
ఇదిలా ఉంటే నిన్న నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గుడివాడలో మరోమారు వైఎస్ఆర్సిపి జెండా ఎగురుతుంది అని, టిడిపి నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని, టిడిపి ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని కొడాలి నాని తేల్చి చెప్పారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications