వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, కొడాలి నానిలకు ఝలక్: టిడిపిలో చేరుతామని చెప్పిన కుడిభుజం

|
Google Oneindia TeluguNews

గుడివాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి.. ఆయన కుడిభుజం, గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాస రావు, మరో ఏడుగురు కౌన్సెలర్లు షాకిచ్చారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా గుడివాడలో వైసిపికి ఇది గట్టి ఎదురుదెబ్బ. వారు తెలుగేదేశం పార్టీలో చేరేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పచ్చజెండా ఊపారు. దీంతో వారు ఈ రోజు సైకిల్ ఎక్కనున్నారు.

'జగన్‌కు షాక్, త్వరలో కృష్ణాలో ఖాళీ': కొడాలి నాని బుజ్జగించినా.. 'అధికారం' రివర్స్ 'జగన్‌కు షాక్, త్వరలో కృష్ణాలో ఖాళీ': కొడాలి నాని బుజ్జగించినా.. 'అధికారం' రివర్స్

గత కొంతకాలంగా పార్టీ ఫిరాయింపులు మళ్లీ వినపడలేదు. తాజాగా గుడివాడలో టిడిపి కండువా కప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో మరోసారి తెరపైకి వచ్చింది.

kodali nani

చైర్మన్ యలవర్తి, మరో ఏడుగురు కౌన్సెలర్లు వైసిపిని వీడి టిడిపిలోకి రావడం వెనుక గుడివాడ ప్రాంతానికి చెందిన టిడిపి నేత హస్తం ఉన్నట్లుగా చెబుతున్నారు. తన శిష్యుడిగా, తన కుడి భుజంగా ఉండే యలవర్తి టిడిపిలోకి వెళ్లడాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ఏమాత్రం జీర్ణించుకోవటం లేదంటున్నారు.

రెండు రోజులుగా యలవర్తిని నిలువరించేందుకు కొడాలి నాని ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదని సమాచారం. తాము వైసిపిలో ఉండలేమని తెగేసి చెప్పారని తెలుస్తోంది. వీరు కొనకళ్ల నారాయణతో కలసి చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ టిడిపిలో చేరనున్నారు.

మున్సిపల్ ఎన్నికల అనంతరం యలవర్తికి చైర్మన్ పదవి దక్కడానికి కొడాలి నానియే కారణం. తాజా పరిణామాలు చూస్తుంటే గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ టిడిపి పరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యలవర్తి ఫిరాయింపుతో వైసిపి బలం 12కు పడిపోనుండగా, టీడీపీ బలం 23కు పెరగనుంది. అంతకుముందు వైసిపి బలం 21, టిడిపి బలం 15.

English summary
Gudivada MLA Kodali Nani right hand may join Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X