వివేకా కేసు ఆధారాలు మాయం- పనబాక లక్ష్మి ఫిజిక్‌ కష్టమే- కొడాలి షాకింగ్ కామెంట్స్‌

తన హాట్ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో ఉండే ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ఇవాళ మరోసారి తనదైన శైలిలో షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా విపక్షాలు నిత్యం విమర్శలు గుప్పిస్తున్న జగన్ బాబాయ్‌ వివేకానందరెడ్డి హత్య కేసుతో మొదలుపెట్టి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక అభ్యర్ధులు గురుమూర్తి, పనబాక లక్ష్మి మీదుగా చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. అన్నింటికీ మించి వైసీపీ ప్రభుత్వాన్నీ, జగన్‌నూ ఇరుకునపెట్టేలా ఉన్నాయి.

మరోసారి రెచ్చిపోయిన కొడాలి నాని

మరోసారి రెచ్చిపోయిన కొడాలి నాని

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఇవాళ పర్యటించిన పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పలు కీలక విషయాలపై స్పందించారు. అందులో సీఎం జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు తిరుపతి లోక్‌సభలో పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్దులు గురుమూర్తి, పనబాక లక్ష్మిపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పనబాక లక్ష్మిని ఉద్దేశించి ఆయన చేసిన హాట్‌ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

చెరిగిపోయిన వివేకా హత్య ఆధారాలు

చెరిగిపోయిన వివేకా హత్య ఆధారాలు

రెండేళ్ల క్రితం జరిగిన సీఎం జగన్ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇప్పటివరకూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు మంత్రి కొడాలి నాని కూడా అందులో చేరి వారికి కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఆధారాలను చెరిపేశారంటూ కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందువల్లే హంతకులను పట్టుకోలేకపోతున్నట్లు కొడాలి చెప్పుకొచ్చారు. హత్య జరిగిన మూడు నెలల వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నారని, అప్పుడు హంతకులను పట్టుకోకుండా ఇప్పుడు జగన్‌పై నిందలేస్తున్నారని కొడాలి మండిపడ్డారు

గురుమూర్తిని వెనకేసుకొచ్చిన కొడాలి

గురుమూర్తిని వెనకేసుకొచ్చిన కొడాలి

ఎలాంటి రాజకీయానుభవం లేకపోయినా తిరుపతి ఉపఎన్నికలో తొలిసారి బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్ది గురుమూర్తిని ఉద్దేశించి విపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కొడాలి నాని స్పందించారు. తన అభ్యర్ధి గురుమూర్తికి రాజకీయానుభవం లేదని చంద్రబాబు చెప్పడం సరికాదని మంత్రి కొడాలి పేర్కొన్నారు. రాజకీయాల్లో సేవాభావం ఉన్న కొత్త తరం రావాలని ఆయన అన్నారు. తద్వారా సేవాభావం కలిగిన గురుమూర్తి తిరుపతి బరిలోకి దిగడం సరైన నిర్ణయమేనని కొడాలి చెప్పినట్లయింది.

పనబాక ఫిజిక్‌పై కొడాలి హాట్‌ కామెంట్స్

పనబాక ఫిజిక్‌పై కొడాలి హాట్‌ కామెంట్స్

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్‌ గురుమూర్తి బరిలోకి దిగడాన్ని సమర్దించిన మంత్రి కొడాలి నాని.. ఆయన ప్రత్యర్ధిగా పోటీలో ఉన్న సీనియర్ మహిళా నేత పనబాక లక్ష్మిపై విమర్శలకు దిగారు. సమస్య అంటే చటుక్కున లేచి పరిగెత్తే బాడీ ఫిజిక్ ఉండాలని, కానీ బౌన్స్‌ వచ్చిన వాళ్లని రాజకీయాల్లో పెట్టుకుని ఏం చేస్తామంటూ పనబాకపై పరోక్షంగా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో పనబాక లక్ష్మి శరీరాకృతిపై మంత్రిగా బాధ్యతాయుత స్దానంలో ఉన్న కొడాలి నాని చేసిన కామెంట్స్‌ సంచలనం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+